Ministers Counter to Etela: ఈటలకు గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రులు

ఈటల వివాదంపై టీఆర్ఎస్ మంత్రులు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై పలువురు మంత్రులు మండిపడ్డారు. ప్రభుత్వంపైనా, సీఎంపైనా విమర్శలు చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.

Ministers Counter to Etela: ఈటలకు గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రులు

Ministers Counter To Etela

TRS Ministers Counter to Etela Rajender : ఈటల వివాదంపై టీఆర్ఎస్ మంత్రులు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై పలువురు మంత్రులు మండిపడ్డారు. ప్రభుత్వంపైనా, సీఎంపైనా విమర్శలు చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఈటలకు పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి ఈటలకు గౌరవం లభించిందని తెలిపారు. తనకు గౌరవం దక్కలేదని ఈటల చెబుతున్న మాటలు అవాస్తవమని అన్నారు. 2,3 ఏళ్లుగా ఈటల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, ఈటలకు అనేక మంచి అవకాశాలిచ్చామని తెలిపారు. ఈటలకు ఎక్కడ ఆత్మ గౌరవం దెబ్బతిన్నదో చెప్పాలన్నారు. పథకాల గురించి ఈటల విమర్శించడం బాధాకరమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీకేం తక్కువ జరిగిందని ఆయన ప్రశ్నించారు. అన్ని విధాలా గౌరవం దక్కినా ఆరోపణలు చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.

పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఈటల అనేక విధాలా లాభపడ్డారని, అసైన్డ్ భూముల కొనడం తప్పని మీకు తెలియదా? అని ఈటలను సూటిగా ప్రశ్నించారు. మీ సంస్థ మీ కోసమే కానీ ప్రజావసరాల కోసం కాదు కదా? అని అన్నారు. ఇప్పుడు అచ్చంపేట, హకీంపేటలో ల్యాండ్ విలువ ఎంత ఉందో మీకు తెలియదా? అలా తెలిసి అసైన్డ్ భూములు మీరు ఎలా కొన్నారని ప్రశ్నలను సంధించారు. దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములు కొనడం తప్పు కాదా? తెలిపారు. ప్రభుత్వం తీసుకునే చర్యలకు మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా సీఎంపై ఆరోపణలు చేయడం ఏంటి? కొప్పుల ఈశ్వర్ తప్పుబట్టారు. మంచిగా ఉన్న పార్టీని డిస్ట్రబ్ చేయడమే మీ ఉద్దేశమా? మంచి పాలన ఇస్తున్న ప్రభుత్వాన్ని డిస్ట్రబ్ చేయడమే మీ ఉద్దేశమా? అని ప్రశ్నించారు.

ఈటల రాజేందర్ మేక వన్నె పులి అంటూ గంగుల కమలాకర్ మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటలేనని దుయ్యబట్టారు. ముదిరాజ్ లను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇవాళ పదవి పోగానే ముదిరాజులు గుర్తుకు వచ్చారా? అని కమలాకర్ ప్రశ్నించారు. పదవిలో ఉన్నప్పుడు బడుగు, బలహీనవర్గాలు గుర్తు రాలేదేనని అన్నారు.

నీ వ్యాపార భాగస్వాముల్లో బడుగు, బలహీనవర్గాలున్నాయా? అని విమర్శలు గుప్పించారు. చీమలు పెట్టిన పుట్టలో ఈటల పాములా దూరాడని, తక్కువ సమయంలో వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ముదిరాజ్ లను ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేసీఆర్ ఒక లెజెండ్.. కేసీఆర్ ఒక శక్తిగా పేర్కొన్నారు. ఈటల అసెంబ్లీలో ఎన్నడైనా బీసీల కోసం మాట్లాడారా? అంబానీ కూడా అంత తక్కువ సమయంలో సంపాదించలేదని ఈటలపై విమర్శనాస్త్రాలను సంధించారు.