TRS Mla: ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే హరిప్రియ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లేందుకు చెందిన భట్టు గణేశ్, స్రవంతి భార్యాభర్తలు, వీరికి ఏడేళ్ల బాబ కృషన్, ఐదేళ్ల పాప హరిప్రియ ఉన్నారు. క్యాన్సర్ బారినపడిన గణేష్ మూడేళ్ళక్రితం మృతి చెందారు

TRS Mla: ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే హరిప్రియ

Trs Mla Haripriya Adopted Two Children

TRS Mla:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లేందుకు చెందిన భట్టు గణేశ్, స్రవంతి భార్యాభర్తలు, వీరికి ఏడేళ్ల బాబ కృషన్, ఐదేళ్ల పాప హరిప్రియ ఉన్నారు. క్యాన్సర్ బారినపడిన గణేష్ మూడేళ్ళక్రితం మృతి చెందారు. స్రవంతి కిడ్నీ సమస్యతో బాధపడుతూ మూడు నెలల క్రితం మృతి చెందారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. దీంతో అమ్మమ్మ నాగమణి వీరిని పెంచే బాధ్యత తీసుకుంది. వారిని పోషించడం నాగమణికి భారమని గ్రహించిన గణేష్ మిత్రుడు ఫణి, మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ లో పిల్లల గురించి వివరించాడు.

ఫణి ట్విట్ పై వెంటనే స్పందించిన కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే హరిప్రియ, కలెక్టర్ డి. అనుదీప్, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మికి ఈ సమాచారం అందించారు. దీంతో ఎమ్మెల్యే హరిప్రియ  చిన్నారుల దగ్గరకు వెళ్లి సమస్య తెలుసుకున్నారు. ఇద్దరు పిల్లల చదువు బాధ్యత తానే తీసుకుంటానని తెలిపారు ఎమ్మెల్యే, వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఏడేళ్ల కృషన్, ఐదేళ్ల హరిప్రియను దత్తత తీసుకుంటానని ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనాథ పిల్లలను హక్కున చేర్చుకున్న ఎమ్మెల్యేకు వారి అమ్మమ్మ నాగమణి కృతఙ్ఞతలు తెలిపారు.