TRS Mlas As Mao’s Target : ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మావోయిస్టులు టార్గెట్ ..

ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మావోయిస్టులు టార్గెట్ చేశారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలను మట్టు పెట్టటానికి మరోసారి తెలంగాణ అడవుల్లో అలజడి రేపుతున్నారు. పక్కాగా ప్లాన్ తో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అంతమొందించేందుకు రెక్కీ కూడా నిర్వహించారని నిఘా వర్గాలు వెల్లడించాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

TRS Mlas As Mao’s Target : ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మావోయిస్టులు టార్గెట్ ..

Trs Mlas As Mao’s Target : తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మావోయిస్టులు టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.ముగ్గురు ఎమ్మెల్యేలు టార్గెట్ గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెక్కీ నిర్వహించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. టైం బాంబ్ తరహా పేలుళ్లకు వ్యూహారచన చేసినట్లు సమాచారం. దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం మావోయిస్టుల కదలికలపై నిఘా పెట్టారు.ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మావోయిస్టులు టార్గెట్ పెట్టారని నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడిక్కడ డేగకళ్లలో పరిశీలిస్తున్నారు. ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మావోయిస్టులు రెక్కీ నిర్వహించినట్లుగా నిఘా వర్గాలు వెల్లడించాయి. టైంబ్ బాంబులతో విరుచుకుపడేలా ప్లాన్స్ వేశారని వెల్లడించాయి.

Telangana : అర్బన్ మావోయిజాన్ని విస్తరించేందుకు దళాల యత్నాలు .. తెలంగాణ-చత్తీస్‌గఢ్ పోలీసులు యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్ వ్యూహాలు

మావోయిస్టులు టార్గెట్ పెట్టినవారిలో చెన్నూర్ బాల్కసుమన్, రామగుండం కోరుకంటి చందర్,దుర్గం చిన్నయ్యలు ఉన్నారు. వీరు ముగ్గురు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని గోదావరి తీరంలో మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు, నిఘావర్గాలు గుర్తించారు. తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను మావోయిస్టులను టార్గెట్‌ చేసుకున్నట్లుగా పసిగట్టారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను హతమార్చేందుకు స్కెచ్ వేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వీరు ముగ్గురిని హతమార్చేందుకు మావోయిస్టులు రెక్కీ కూడా నిర్వహించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇందుకోసం మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్యనేతలు కూడా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. కానీ మావోలు ఇప్పటి వరకు ఎక్కడా ఎటువంటి హింసకు పాల్పడలేదు. వారి సైలెన్స్ పక్కా ప్లాన్ ప్రకారమేనా? లేదా వ్యూహాన్ని మార్చుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

బెల్లంపల్లి, చెన్నూరు నియోజకవర్గాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉంటాయి. ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యేలపై దాడి చేశాక.. వెంటనే కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రాణహిత నది దాటి మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోకి పారిపోయేందుకు వీలుంది. కానీ రామగుండం మైదాన ప్రాంతం కావడంతో.. అక్కడ ఎలాంటి హింసకు పాల్పడినా.. పోలీసులకు వెంటనే దొరికిపోతారు. ఈ క్రమంలోనే మొదట చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలను మావోయిస్టులు టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంలో వారి మధ్య మావోల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని కూడా సమాచారం.

ఇద్దరూ దళిత ఎమ్మెల్యేలు కావడంతో.. వారిపై దాడి జరిగితే.. మావోయిస్టుల పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశముందని మావోలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందువల్లే వారిద్దరిపై దాడి ప్రయత్నాన్ని విరమించుకున్నట్లుగా కూడా సమాచారం. మొత్తంగా ముగ్గురి హత్య రెక్కీ నిర్వహించినా..సామాజిక కోణాలు, భౌగోళికంగా ప్రతికూల పరిస్థితులను పరిగణలోకి తీసుకొని.. నిర్ణయాన్ని మావోలు మార్చుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది.

Maoists Movements in Telangana : తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల కదలికలు .. అప్రమత్తమైన పోలీసులు.. మావోల తలపై రివార్డు ప్రకటన

మరోవైపు మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్, కేంద్ర కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి అలియాస్‌ ధర్మన్న తెలంగాణలోకి ప్రవేశించారని నిఘావర్గాలకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలోనే మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు నిఘాను పెంచారు. గోదావరి చుట్టుపక్కల కూంబింగ్ నిర్వహిస్తున్నారు.అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. మావోలకు ఆశ్రయం ఇవ్వవద్దని గిరిజనులకు స్పష్టం చేస్తున్నారు. పలు గ్రామాల్లోనూ పోస్టర్లు వేసి.. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ , మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చి.. ఎన్టీపీసీ, ఎఫ్‌సీఐ, గోదావరిఖని పారిశ్రామికవాడల్లో పనిచేస్తున్న వలస కూలీల్లో.. మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో వారిపైనా నిఘా ఉంచారు.

Maoists Entered In Telangana : మావోయిస్టుల ఏరివేతకు తొలిసారి రంగంలోకి దిగిన NSG బలగాలు