Minister KTR : టీఆర్ఎస్ నేతలెఎవరూ నోరు విప్పొద్దు.. కేటీఆర్ కీలక ఆదేశాలు

టీఆర్ఎస్ నేతలెవరూ ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించిన కేటీఆర్.. కేసు దర్యాఫ్తు ప్రాథమిక దశలో ఉందన్నారు. మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, పార్టీ శ్రేణులకు సూచించారు.

Minister KTR : టీఆర్ఎస్ నేతలెఎవరూ నోరు విప్పొద్దు.. కేటీఆర్ కీలక ఆదేశాలు

Minister KTR : ఎమ్మెల్యేల ప్రలోభాల పర్వంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక కామెంట్లు చేశారు. టీఆర్ఎస్ నేతలెవరూ ఎవరూ మాట్లాడొద్దని ఆదేశించిన కేటీఆర్.. కేసు దర్యాఫ్తు ప్రాథమిక దశలో ఉందన్నారు. మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని, పార్టీ శ్రేణులకు సూచించారు. అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్లు మొరుగుతూనే ఉంటారని ఘాటుగా ట్వీట్ చేశారు కేటీఆర్. వాటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్.

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు కొంత సమయానికి ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెలుగుచూడటం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు యత్నించిన ఓ ముఠాను సైబరాబాద్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసులకు చిక్కిన వారిలో ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి అలియస్ సతీశ్ శర్మ, తిరుపతికి చెందిన సింహయాజి స్వామి, హైదరాబాద్ లో దెక్కన్ ప్రైడ్ పేరిట హోటల్ నడుపుతున్న అంబర్ పేటకు చెందిన నందకుమార్ లు ఉన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

టీఆర్ఎస్ కు చెందిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్థన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిలతో మొయినాబాద్ లోని ఫామ్ హౌజ్ వేదికగా నిందితులు చర్చలు జరిపారు. ఈ చర్చల అనంతరం ఎమ్మెల్యేలే స్వయంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు సమాచారం ఇచ్చారు. దీంతో తన బలగాలతో కలిసి స్టీఫెన్ రవీంద్ర స్వయంగా రంగంలోకి దిగి.. ముఠాలోని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఫామ్ హౌజ్ పై దాడి సందర్బంగా ముగ్గురు నిందితులు పట్టుబడగా.. వారి వద్ద నుంచి బ్యాగుల్లో కుక్కిన కరెన్సీ నోట్ల కట్టలను పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాము చెప్పినట్లుగా పార్టీ ఫిరాయిస్తే.. ఒక్కొక్కరికి రూ.100 కోట్ల చొప్పున డబ్బు ఇస్తామని, డబ్బుతో పాటు కాంట్రాక్టులు, పదవులు కూడా ఇస్తామని నిందితులు ప్రలోభపెట్టినట్లు సమాచారం. ఈ ప్రలోభాలు బీజేపీ నుంచే వచ్చాయని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, మునుగోడులో ఓటమి భయంతో కేసీఆర్ ఈ నాటకానికి తెరలేపారని బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు.