CM KCR Master Mind : అట్లుంటది కేసీఆర్‌తోని.. ప్లాన్ చేస్తే ప్రత్యర్థి చిత్తు కావాల్సిందే, మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్న గులాబీ బాస్

స్కెచ్ వేస్తే ప్రత్యర్థి చిత్తు కావాల్సిందే. వ్యూహం రచించారా.. ఉద్దండులైనా యుద్ధ క్షేత్రం నుంచి పరుగులు పెట్టాల్సిందే. పొలిటికల్ ఎత్తులు వేయడంలో తనకు తానే దిట్ట అని మరోసారి నిరూపించుకున్నారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.

CM KCR Master Mind : అట్లుంటది కేసీఆర్‌తోని.. ప్లాన్ చేస్తే ప్రత్యర్థి చిత్తు కావాల్సిందే, మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్న గులాబీ బాస్

CM KCR Master Mind : స్కెచ్ వేస్తే ప్రత్యర్థి చిత్తు కావాల్సిందే. వ్యూహం రచించారా.. ఉద్దండులైనా యుద్ధ క్షేత్రం నుంచి పరుగులు పెట్టాల్సిందే. పొలిటికల్ ఎత్తులు వేయడంలో తనకు తానే దిట్ట అని మరోసారి నిరూపించుకున్నారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. అప్పటి ఓటుకు నోటు వ్యవహారం అయినా, ఇప్పటి ఫామ్ హౌజ్ బేరసారాల రాజకీయ వ్యాపారమైనా లెక్క వేసి కొడితే ప్రత్యర్థికి మైండ్ బ్లాంక్ కావాల్సిందేనని మరోసారి ప్రూవ్ చేశారు.

తన జోలికొస్తే గురి చూసి నేల కరిపించడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. వ్యూహాలు రచించడమే కాదు వాటిని పకడ్బందీగా అమలు చేయడంలోనూ గులాబీ బాస్ దిట్ట. కారు పార్టీ ప్రకటన నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న కేసీఆర్.. ఇక పనైపోయిందనుకున్న ప్రతీసారి రివ్వున లేచారు. రాజకీయాలను లెక్క కట్టడంలో ఆరితేరారు. ప్రత్యర్థి దెబ్బ కొడదామని ఆలోచించేలోగానే తాను దెబ్బ కొట్టి చూపించారు. ఇప్పుడు కూడా నేషనల్ పాలిటిక్స్ వైపు పయనం సాగిస్తూనే తనపై జరిగే దాడిని ముందుగానే ఊహించారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేస్తున్న వ్యూహాన్ని పసిగట్టి ప్రత్యర్థి ప్లాన్ ను చిత్తు చిత్తు చేశారు. రాష్ట్రంలో ఒక్కప్పుడు బలమైన ప్రత్యర్థిగా ఉన్న టీడీపీని ఒక్క దెబ్బతో మట్టికరిపించారు కేసీఆర్. ఓటుకు నోటు కేసుతో కోలుకోలేకుండా చేసి తెలంగాణలో టీడీపీ ఉనికినే ప్రశ్నార్థకం చేసేశారు. ఇప్పుడు అదే స్థాయిలో దూసుకొస్తున్న బీజేపీనీ టార్గెట్ చేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్.. తన ప్రత్యర్థిగా బీజేపీనే ఎంచుకున్నారు. ఈ క్రమంలో తనకు వస్తున్న బెదిరింపులను కూడా లెక్క చేయలేదు. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేయలేని పనిని సులువుగా, తెలివిగా చేసి చూపించారు. ఢిల్లీ నుంచి పన్నిన వ్యూహాన్ని దూదిపింజలా గాల్లో తేలిపోయేలా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బేరసారాల బండారాన్ని బయటపెట్టి ప్రత్యర్థికి కక్కలేని మింగలేని పరిస్థితి కల్పించారు కేసీఆర్.

టీఆర్ఎస్ లో కూడా ఏక్ నాథ్ షిండేలు ఉన్నారని, గులాబీ పార్టీ కుప్పకూలడం ఖాయమంటూ కొన్ని రోజులుగా బీజేపీ నేతలు ఒకరకంగా బెదిరిస్తూ వస్తున్నారు. ఒక సమయంలో వరుసగా టీఆర్ఎస్ నాయకులకు తమ కండువా కూడా కప్పేశారు. ఉద్యమ పార్టీ తమదని ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే బీజేపీ నుంచి వరుసగా ఉద్యమకాలం నాటి తన పాత మిత్రులను తిరిగి కారెక్కించుకున్నారు.

ఇప్పుడు తన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు పక్కదారి పట్టకుండా గట్టి ప్లాన్ చేశారు కేసీఆర్. దీనికి కౌంటర్ అటాక్ వస్తుందని ముందే ఊహించి ఫామ్ హౌజ్ బేరసారాలను పక్కా ప్లాన్ తో గండికొట్టారు కేసీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని పక్కా సమాచారంతో పోలీసులు బ్రేక్ చేశారని బయటకు కనిపిస్తున్నా.. దీని వెనుక సీఎం కేసీఆర్ వ్యూహరచన ఉన్నట్లుగానే కనిపిస్తోంది.

ఇక్కడ ఎమ్మెల్యేలను తానే ఎరగా వేసి ప్రత్యర్థి పార్టీ బేరసారాల రాజకీయాలను బట్టబయలు చేశారో లేక నిజంగానే జరుగుతున్న ఎమ్మెల్యేల బేరసారాల ప్రయత్నాలను గుర్తించి దెబ్బకొట్టారో కానీ.. దెబ్బ మాత్రం అదుర్స్ అనిపించింది. అట్లుంటది కేసీఆర్ తోని అని మరోసారి తేలిపోయింది.