TRS MLC Candidates : ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థులు!

రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న.. టీఆర్ఎస్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ఆల్‌మోస్ట్ ఖరారైపోయారు.

TRS MLC Candidates : ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు వేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థులు!

Trs Mlc Nominations

TRS MLC Candidates :  రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న.. టీఆర్ఎస్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు.. ఆల్‌మోస్ట్ ఖరారైపోయారు. మొత్తం 12 మంది జాబితాకు.. గులాబీ బాస్ కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అయితే.. సిట్టింగుల్లో ఐదుగురికి మాత్రమే మళ్లీ అవకాశం దక్కింది. వాళ్లంతా ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. మరి.. కొత్తగా.. ఎమ్మెల్సీ పదవులకు పోటీ చేయబోతున్న ఆ ఏడుగురు ఎవరో చూడండి..

మొత్తానికి.. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై క్లారిటీ వచ్చేసింది. జనవరిలో ఖాళీ కానున్న 12 స్థానాలకు.. అభ్యర్థుల్ని ఖరారు చేశారు సీఎం కేసీఆర్. అయితే.. స్థానిక సంస్థల కోటాలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీల్లో.. ఐదుగురికి మాత్రమే మళ్లీ అవకాశం దక్కనునున్నట్లు సమాచారం. ఇందులో.. కరీంనగర్ నుంచి భానుప్రసాద్, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, మహబూబ్‌నగర్ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డికి.. మరోసారి పోటీ చేసే అవకాశం దక్కింది.

Also Read : Mayor, Chairman Elections : మేయర్, చైర్మన్‌ల ఎన్నిక నేడే

కొత్తగా.. ఏడుగురికి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చింది టీఆర్ఎస్ అధిష్టానం. ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా పురాణం సతీశ్ స్థానంలో దండే విఠల్‌ను ఎంపిక చేసింది. 2014 ఎన్నికల్లో సనత్‌నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి.. విఠల్‌ ఓటమిపాలయ్యారు. కరీంనగర్ నుంచి నారదాసు లక్ష్మణ్ రావు స్థానంలో.. ఎల్.రమణకు చాన్స్ దక్కింది. నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి స్థానంలో ఎంసీ కోటిరెడ్డికి అవకాశం ఇచ్చారు. నిజామాబాద్ నుంచి మరోసారి పోటీ చేసేందుకు.. కల్వకుంట్ల కవిత ఆసక్తి చూపడం లేదు. దీంతో.. ఆమె స్థానంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది.

ఇక.. ఖమ్మం జిల్లా నుంచి ఈసారి కూడా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి.. నిరాశే ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ స్థానంలో.. ఎన్ఆర్ఐ తాతా మధుకు అవకాశం దక్కనుంది. ఈయన.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డికి.. స్వయానా బావమరిది. ఇక.. మెదక్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అభ్యర్థిత్వం ఊగిసలాటలో ఉంది. ఇక్కడ.. కొత్తగా డాక్టర్ యాదవరెడ్డి పేరు వినిపిస్తోంది. అదేవిధంగా.. మహబూబ్‌నగర్ నుంచి కూచుకుళ్ల దామోదరరెడ్డి స్థానంలో.. సింగర్ సాయిచంద్ పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది.