Covid – 19 : టీఆర్ఎస్ ఎంపీ కేశవరావుకు కరోనా పాజిటివ్

టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కే. కేశవరావు(కేకే) కరోనా వైరల్ బారిన పడ్డారు. తాజాగా కరోనా పరీక్ష చేయించుకోగా కేకేకి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Covid – 19 : టీఆర్ఎస్ ఎంపీ కేశవరావుకు కరోనా పాజిటివ్

Covid 19

Covid – 19 : టీఆర్ఎస్ ఎంపీ, సీనియర్ నేత కే. కేశవరావు(కేకే) కరోనా వైరల్ బారిన పడ్డారు. తాజాగా కరోనా పరీక్ష చేయించుకోగా కేకేకి కరోనా పాజిటివ్‌గా తేలింది. మొదట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కొవిడ్ పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆయనను కలిసిన పార్టీ నేతలు పరీక్షలు చేయించుకోగా పలువురికి వైరల్ బయటపడుతోంది. అయితే వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో తాజాగా మంత్రుల బృందం ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే.. ఈ సమయంలో కేశవరావుతో వీరంతా భేటీ అయ్యారు.

చదవండి : India Covid Vaccination : పిల్లలు, వృద్ధుల వివరాలు వెల్లడించిన కేంద్రం, తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది అంటే

ఎర్రబెల్లికి కరోనా సోకిన విషయం తెలియడంతో కేకే పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో కేకేకి కరోనా నిర్దారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నిమ్స్ వైద్యుల సలహాతో కేశవరావు హోం ఐసోలేషన్ లో ఉన్నారు. ఇక ఢిల్లీ పర్యటనకు వెళ్లిన వారిలో ఇప్పటి వరకు ముగ్గిరికి కరోనా పాజిటివ్ అని తెలింది. మొదట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నిర్ధారణ అయింది. తర్వాత ఎంపీ రంజిత్ రెడ్డికి తాజా గా కేశవరావుకు కరోనా నిర్ధారణ అయింది.

చదవండి : Third Covid Dose : కరోనా మూడో డోస్..వృద్ధులకు డాక్టర్ సర్టిఫికేట్, ప్రిస్కిప్షన్ అవసరం లేదు