MP Kavitha dance: ‘బుల్లెట్టు బండి’ పాటకు స్టెప్పులేసిన ఎంపీ కవిత..

‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే పాటకు TRS MP మాలోతు కవిత వేసిన డ్యాన్స్ వేసారు. ఓ పెళ్లికి వెళ్లిన ఎంపీ వధూవరులతో కలిసి పెళ్లి వేదికపైనే స్టెప్పులేసారు.

MP Kavitha dance: ‘బుల్లెట్టు బండి’ పాటకు స్టెప్పులేసిన ఎంపీ కవిత..

Trs Mp Maloth Kavitha Dance In Wedding

TRS MP Maloth Kavitha Dance: పెళ్లి బారాత్ లో ‘నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తా పా’ అనే పాటకు ఓవధువు వేసిన డ్యాన్స్ ఎంత ఫేమస్ అయిపోయిందో..ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. ప్రముఖ గాయని ‘మోహనా భోగరాజు’ గొంతునుంచి జాలువారిన ఈ పాట వధువు డ్యాన్స్ తో వీర లెవెల్ లో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఎవరి నోట విన్నా అదే పాట మారుమ్రోగిపోతోంది. నీ బుల్లెట్టు బండెక్కి అనే ఫోక్ సాంగ్ ఉర్రూతలు ఊగిస్తోంది.చిన్నారులు కూడా ఈ పాటకు అద్భుతమైన స్టెప్పులు వేసి యూట్యూబ్ ని షేక్ చేస్తున్నారు.

కుర్రకారును ఉరకలేయిస్తూ..ఆడపడుచుల్లో ఆనందం ఉప్పొంగి స్టెప్పులేసేలా చేస్తున్న బుల్లెట్ బండి సాంగ్ వింటే సామాన్యులకే కాదు ప్రజాప్రతినిధులకు కూడా కాలు నిలవడం లేదనిపిస్తోంది ఓ మహిళా ఎంపీ ఈ పాటకు వేసిన స్టెప్పులు చూస్తే. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత ‘ నీ బుల్లెట్ బండి ’ పాటకు డ్యాన్స్ వేయటం హాట్ టాపిక్‌గా మారింది..

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా అనే పాటకు స్వరం కలుపుతూ,పాదం కదుపుతూ ఓ పెళ్లి వేడుకలో స్టెప్పులేసారు మాలోపు కవిత. TRS నాయకుడు ముత్యం వెంకన్న కుమారుడి వివాహ వేడుకలకు హాజరైన ఎంపీ కవిత ఈ పాట వినగానే స్టెప్పులేశారు. పెళ్లి వేదిక పైనే వధూవరులతో కలిసి స్టెప్పులేశారు..

ప్రస్తుతం పెళ్లి వేడుకల్లో ఈ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.. ఎక్కడ చూసినా ఇదే సాంగ్ వినిపిస్తూ షేక్ చేస్తూ సమ్‌థింగ్ స్పెషల్ గా మారిందీ ఫోక్ సాంగ్. ఈ పెళ్ళి వేడుకలో పాల్గొన్న వారంతా ఎంపీ కవిత బుల్లెట్ డ్యాన్స్ చూసి కేకలు వేసి ఉత్సాహపరిచారు. ప్పుడు ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.