TRS Plenary Live Updates: టీఆర్ఎస్ ప్లీనరీ.. హైటెక్స్‌లో సందడి…!

టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకతో హైదరాబాద్ లోని హైటెక్స్ లో సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణలు.. పెద్ద సంఖ్యలో ప్రాంగణానికి తరలి వస్తున్నాయి.

10TV Telugu News

TRS Plenary : టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకతో హైదరాబాద్ లోని హైటెక్స్ లో సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ శ్రేణలు.. పెద్ద సంఖ్యలో ప్రాంగణానికి తరలి వస్తున్నాయి. పాసులు ఉన్న వారిని మాత్రమే సిబ్బంది వేడుకకు అనుమతిస్తున్నారు. భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.

 

 • వాళ్లొస్తే.. దళితబంధు సాధ్యమైతదా..

  దళితబంధు వంటి పథకం అమలు.. జాతీయ పార్టీలతో సాధ్యం కాదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఆ పార్టీలు అధికారంలోకి వస్తే.. దేశమంతా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్లు వస్తాయి కాబట్టి.. ఆ పార్టీలు దళితబంధును అమలు చేయబోవని అన్నారు.

 • ప్రజలే మాకు బాసులు..

  టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బాసులని కేసీఆర్ అన్నారు. ప్రజా సంక్షేమమే తమ పార్టీ ధ్యేయమని చెప్పారు.

 • వాళ్లు కిరికిరిగాళ్లు.. ఢిల్లీ గులాములు!

  బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు.. కిరికిరిగాళ్లని.. ఢిల్లీ గులాములని కేసీఆర్ విమర్శించారు.

 • ఏపీలో పార్టీ పెట్టాలంటున్నారు

  టీఆర్ఎస్ పార్టీ పాలనపై ఏపీ ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారని కేసీఆర్ చెప్పారు. ఏపీలో టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాలని కోరుతున్నారని అన్నారు.

 • పాలమూరులో వలసలు తగ్గాయ్..

  పాలమూరులో ఒకప్పుడు ఉన్న వలసలు తగ్గాయి. పాలమూరు జిల్లాకే వలసలు వచ్చే పరిస్థితి ఏర్పడింది.

 • మన పథకాలను చాలా మంది కాపీకొడుతున్నారు

  తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు మన పథకాలను కాపీ కొడుతున్నాయి.

 • రాజీలేని పోరాటంతోనే తెలంగాణ సాధ్యమైంది

  టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు చాలా మందికి నమ్మకం లేదు. కానీ.. రాజీలేని పోరాటంతోనే తెలంగాణ సాధన కల సాకారమైంది. – KCR

 • ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు

  తనను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు.. పార్టీ నేతలందరికీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఏర్పాటు నుంచి జరిగిన పరిణామాలు గుర్తు చేసుకున్నారు.

 • టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవం

  టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నేతలు ప్లీనరీ వేదికపై ప్రకటించగా.. నేతలంతా కేసీఆర్ ను అభినందనలతో ముంచెత్తారు.

 • అమరులకు నివాళి

  తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చి.. ఇప్పుడు దివంగతులైన నేతలకు.. టీఆర్ఎస్ ప్లీనరీ నివాళి అర్పించింది. వారి సేవలను స్మరించుకున్న అనంతరం.. నిముషం పాటు మౌనం పాటించారు.. నేతలు.

 • కేసీఆర్ ప్రసంగం

 • 20 ఏళ్ల ప్రస్థానంలో.. కలిసి వచ్చినవాళ్లు చాలామంది!

  కేకే ప్రసంగం తర్వాత కేసీఆర్ మాట్లాడారు. 20 ఏళ్ల ప్రస్థానంలో ఎంతో మంది తమతో కలిసి వచ్చారని గుర్తు చేసుకున్నారు. వారిలో కొందరు దివంగతులయ్యారని కేసీఆర్ స్మరించుకున్నారు.

 • రైతుల ఆత్మహత్యలు తగ్గాయి…

  కేసీఆర్ పరిపాలనలో రైతుల ఆత్మహత్యలు పోయాయ్. అన్నదాతలకు ఇప్పుడు తెలంగాణ స్వర్గధామం.

 • ప్లీనరీ వేదికపై కేకే తొలి ప్రసంగం

  ప్లీనరీ వేదికపై.. టీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు తొలి ప్రసంగం చేశారు. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ వెలిగిపోతోందని.. రాష్ట్ర ప్రజల కష్టాలు తీరాయని చెప్పారు. కేసీఆర్ పరిపాలనలో అమలవుతున్న పథకాలు.. దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.

 • తెలంగాణ అమరులకు నివాళి

  పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం.. తెలంగాణ అమర వీరుల స్థూపానికి కేసీఆర్ నివాళి అర్పించారు.