సరిలేరు కారుకెవ్వరు : మున్సిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ సెంచరీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ జోరుకి

  • Published By: veegamteam ,Published On : January 25, 2020 / 07:39 AM IST
సరిలేరు కారుకెవ్వరు : మున్సిపల్ ఫలితాల్లో టీఆర్ఎస్ సెంచరీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ జోరుకి

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ జోరుకి విపక్షాలు బేజారయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ సెంచరీ కొట్టింది. 120 మున్సిపాలిటీలకు గాను 103 మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. 9 కార్పొరేషన్లకు గాను ఐదింటిని కైవసం చేసుకుంది. అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ ఏకపక్ష విజయం నమోదు చేసింది.

కాంగ్రెస్, బీజేపీ కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీ 4 మున్సిపాలిటీలను మాత్రమే దక్కించుకుంది. బీజేపీ(అమన్ గల్), ఎంఐఎం(భైంసా) కేవలం ఒక్క మున్సిపాలిటీకే పరిమితం అయ్యాయి. ఐజ, భునవగిరి, చౌటుప్పల్ మున్సిపాలిటీల్లో హంగ్ ఫలితం వచ్చింది. ఐజలో ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో గెలుపొందారు. 

మున్సిపోల్స్‌లో ఓట‌ర్లు ఇచ్చిన తీర్పు.. టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం నింపింది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచి టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. రంగులు చల్లుకుని డ్యాన్సులు చేశారు. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే.. రాష్ట్రంలో పాజిటివ్ ఓటు పెరిగిన‌ట్లు రికార్డులు స్ప‌ష్టం చేస్తున్నాయి.  అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఆర్ఎస్‌కు 47 శాతం ఓటు షేర్ వ‌చ్చింది. ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల్లో సుమారు 51 శాతం ఓటు షేర్ వ‌చ్చిన‌ట్లు రాజ‌కీయ విశ్లేష‌కులు వెల్ల‌డిస్తున్నారు. గ‌త ఆరేళ్ల‌లో టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన పురోగ‌తి స్ప‌ష్టంగా క‌నిపించిందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి.. పుర ఓట‌ర్లు.. టీఆర్ఎస్‌కు ప‌ట్టం క‌ట్టార‌ని చెబుతున్నారు.

ఎన్నడూ లేని విధంగా గ‌త ఆరేళ్ల‌లో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జ‌రిగింద‌ంటున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం నీటికి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చిందని…  తాగునీరు, పంట పొలాల‌తో తెలంగాణ ప‌చ్చ‌ద‌నంగా మారింద‌ని వెల్లడించారు. చాలావ‌ర‌కు ప‌ట్ట‌ణాలు నీటి స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ్డాయ‌ని, అందుకే ప‌ట్ట‌ణ ఓట‌ర్లు .. పుర ఎన్నిక‌ల్లో గులాబీకి ప‌ట్టం క‌ట్టార‌ని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు.

రాష్ట్రంలో గ‌త కొన్నేళ్లుగా విద్యుత్ కొర‌త కూడా లేకపోవడం ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించ‌డంలో.. ఓ ప్ర‌ధానాంశం అంటున్నారు. ఇక గ‌త ఆరేళ్లుగా తెలంగాణ‌లో ఎటువంటి హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు లేవని, లా అండ్ ఆర్డ‌ర్ స‌మ‌స్య‌లు లేవని, శాంతిభ‌ద్ర‌త‌లు అదుపులో ఉన్నాయని గుర్తు చేశారు. అందుకే ప‌ట్ట‌ణ ఓట‌ర్లు.. కేసీఆర్ ప్ర‌భుత్వానికి పూర్తి మెజారిటీ ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు.

Also Read : ప్లీజ్.. కేటీఆర్ ను కలిసే అవకాశమివ్వండి : బ్యాలెట్ బాక్సులో ఓట్లతో పాటు లెటర్