Minister KTR: బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అంతు చూస్తాం: మంత్రి కేటీఆర్

లక్షలాది మంది రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెబుతుందని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

Minister KTR: బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అంతు చూస్తాం: మంత్రి కేటీఆర్

Ktr

Minister KTR: లక్షలాది మంది రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత మాటలు చెబుతుందని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు గురించి సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను సైతం పట్టించుకోకుండా తెలంగాణ బీజేపీ నేతలు రైతులని రెచ్చగొట్టి వరి సాగు చేసేలా ప్రకటనలు చేశారని..ఇప్పుడు తెలంగాణ ధాన్యం కొనబోమంటూ కేంద్రం చెప్పడం దారుణమని కేటీఆర్ అన్నారు. ధాన్యం కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తామని, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు చెప్పారని..అయితే ఇప్పుడు కేంద్రంలో ఉలుకు పలుకు లేదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.

Also read:RTC Charges Hike : ఆర్టీసీ గట్టెక్కాలంటే.. చార్జీల పెంపు తప్పనిసరి-బాజిరెడ్డి

ఢిల్లీ బీజేపీ, సిల్లీ బీజేపీలు వేర్వేరు ప్రకటనలు చేస్తూ తెలంగాణ రైతులను అవమాన పరిచిన బీజేపీని వదిలేది లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. నిబంధనల లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ను ఎన్నో సార్లు ఆడిగామన్న కేటీఆర్..పార్లమెంటులో పీయుష్ గోయెల్ అహంకారంతో మాట్లాడారని దుయ్యబట్టారు. రైతులపై ప్రేమ, దయ లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు, అంతు చూస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థలు నుంచి తీర్మానం చేసి..ఉద్యమ కార్యాచరణ రూపొందించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

Also read:India-Australia: భారత్ – ఆస్ట్రేలియా మధ్య కీలక ఒప్పందాలు: వాణిజ్య, వృత్తి, విద్యా విసాలు సులభతరం

అందులో భాగంగా 4వ తేదీన అన్ని మండల కేంద్రాల్లో రైతులతో నిరసన దీక్షలు, 6న నాలుగు జాతీయ రహదారుల పై నిరసన, 7వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 8వ తేదీన గ్రామ పంచాయతీలలో రైతులు తమ ఇళ్ల వద్ద నల్ల జెండాలతో నిరసన, 11వ తేదీన ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టనున్నట్లు కేటీఆర్ వివరించారు.

Also read:Anand Mahindra: బుడతడు చేపలు పట్టే విధానంలో “విజయాన్ని చూసిన” ఆనంద్ మహీంద్రా: వైరల్ వీడియో