BRS Party: అట్టహాసంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం.. ఈసీ పత్రాలపై సంతకం చేసిన సీఎం కేసీఆర్..

21ఏళ్ల టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ప్రస్థానం ముగిసింది. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా ప్రయాణం ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ ఈసీ పత్రాలపై సంతకం చేసి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించారు.

BRS Party: అట్టహాసంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం.. ఈసీ పత్రాలపై సంతకం చేసిన సీఎం కేసీఆర్..

BRS

BRS Party: 21ఏళ్ల టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) ప్రస్థానం ముగిసింది. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి)గా ప్రయాణం ప్రారంభమైంది. తెలంగాణ భవన్‌లో శుక్రవారం బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మధ్యాహ్నం 1.20 గంటలకు సీఎం కేసీఆర్ ఈసీ పత్రాలపై సంతకం చేసి టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు జేడీఎస్ చీఫ్ కుమారస్వామి, నటుడు ప్రకాశ్ రాజ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ కండువాను కేసీఆర్ ధరించారు. ఈ ఆవిర్భావ వేడుకల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాల నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

TRS-BRS : మధ్యాహ్నం 1.20 గంటలకు బీఆర్ఎస్ ఆవిర్భావ సభ..జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌కు గురువారం అధికారికంగా లేఖ అందింది. దీంతో శుక్రవారం తెలంగాణ భవన్‌లో అట్టహాసంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు జరిగాయి. భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా ప్రకటించారు. దీంతో ఇకనుంచి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా చెలామణిలోకి వచ్చింది.

BRS In Andhra Pradesh : ఏపీలో ‘జై కేసీఆర్’ అంటూ బీఆర్ఎస్‌కు మద్దతుగా ఫ్లెక్సీలు

బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. బాణసంచా కాలుస్తూ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకున్నారు.