TRSV Leaders Gun Firing : హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం.. కాల్పులు జరిపి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న TRSV నాయకులు

హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం రేగింది. రాచకొండ మిర్ఖంపేట గెస్ట్ హౌస్ లో టీఆర్ఎస్ వీ నాయకులు గన్ తో కాల్పులు జరిపారు. TRSV మండల ప్రెసిడెంట్ విగ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ లు గన్ తో గాల్లోలోకి ఫైరింగ్ చేశారు. గాల్లోలోకి కాల్పులు జరపడమే కాదు..

TRSV Leaders Gun Firing : హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం.. కాల్పులు జరిపి వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న TRSV నాయకులు

TRSV Leaders Gun Firing : హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం రేగింది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్ ఖాన్ పేట్ గెస్ట్ హౌస్ లో టీఆర్ఎస్ వీ నాయకులు గన్ తో కాల్పులు జరిపారు. TRSV మండల ప్రెసిడెంట్ విగ్నేశ్వర్ రెడ్డి, విక్రమ్ లు గన్ తో గాల్లోలోకి ఫైరింగ్ చేశారు. గాల్లోలోకి కాల్పులు జరపడమే కాదు ఫైరింగ్ దృశ్యాలను చిత్రీకరించి వాటిని తమ వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకున్నారు. గాల్లోలోకి కాల్పుల ఘటన కలకలం రేపుతోంది.

టీఆర్ఎస్ వీ నాయకులు తొలుత గెస్ట్ హౌస్ లో వేడుక చేసుకున్నారు. ఆ తర్వాత గన్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పులు ఈ రోజు జరిపారా? లేక నెల రోజుల క్రితం జరిపారా? అనేది పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. అలాగే, అది ఎయిర్ గన్నా? లేక ఒరిజినల్ గన్నా? అనేది తెలియాల్సి ఉంది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదంతా అధికార పార్టీకి చెందిన ఓ నేత గెస్ట్ హౌస్ లో నిర్వహించిన బర్త్ డే వేడుకలో జరిగినట్టు పోలీసులు గుర్తించారు.

ఆ దిశగా ఆధారాలు కూడా సేకరించారు. ఫైరింగ్ దృశ్యాలను వాట్సాప్ లో స్టేటస్ గా పెట్టుకోవడం వల్లే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలు ఫైరింగ్ ఎందుకు చేశారు? వాట్సాప్ స్టేటస్ గా ఎందుకు పెట్టుకున్నారు? ఆ గన్ లు ఎక్కడి నుంచి వచ్చాయి? వారికి ఎవరు ఇచ్చారు? ఆ గెస్ట్ హౌస్ లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది? ఈ దిశగా పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది.

ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్ తీసుకుని గాలిలోకి కాల్పులు జరిపిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారం రాజకీయాలను కుదిపేస్తోంది. మిస్ ఫైరింగ్ జరిగుంటే, ఎవరి ప్రాణం అయినా పోయి ఉంటే పరిస్థితి ఏంటని విపక్ష నేతలు ప్రశ్నింస్తున్నారు. శ్రీనివాస్ గౌడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది మరువక ముందే అధికార పార్టీకే చెందిన మరో నేత ఇలా గన్ తో గాల్లో కాల్పులు జరపడం, స్టేటస్ గా పెట్టుకోవడం పెను దుమారం రేపుతోంది.