నవంబర్ 19 నుంచి తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ రీలీజ్…

  • Published By: Chandu 10tv ,Published On : November 14, 2020 / 09:32 AM IST
నవంబర్ 19 నుంచి తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సిలింగ్ షెడ్యూల్ రీలీజ్…

TS Pharmacy counselling schedule: తెలంగాణ ఎంసెట్ ఫార్మసీ కౌన్సిలంగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంసెట్ బైపీసీ అభ్యర్దులకు బీ ఫార్మసీ, ఫార్మా డీ, బయో టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ తేదీలను ఖరారు చేసింది ఉన్నత విద్యామండలి. ఈ నెల నవంబర్ 19, 2020 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకారనుందని వెల్లడించింది.



ధ్రువపత్రాల పరిశీలన కోసం అభ్యర్దులు నవంబరు 19, 2020 నుంచి నవంబరు 21, 2020 ఆన్ లైన్ లో ఫీజు చెల్లించి స్లాట్ బుకింగ్‌ చేసుకోవాలి. ఈ నెల 20, 21న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ నెల 20 నుంచి 22 వరకు వెబ్‌ ఆప్షన్లకు నమోదు ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 24 నుంచి 27 వరకు ఆన్ లైన్ లో ట్యూషన్ ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియ చేయాలని ప్రవేశాల కమిటీ కన్వీనర్ నవీన్ మిత్తల్ తెలిపారు.



డిసెంబరు 1, 2020న తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. తుది విడత ధ్రువపత్రాల కోసం ఆన్ లైన్ డిసెంబరు 1న ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవాలి. డిసెంబర్‌ 2న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. డిసెంబరు 2, 3 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు నమోదు ప్రక్రియ. డిసెంబరు 5న అభ్యర్థులకు తుది విడత ఫార్మసీ స్లీటను కేటాయిస్తారు.



తుది విడత కౌన్సిలింగ్ లో సీటు వచ్చిన అభ్యర్దులు డిసెంబరు 5, 2020 నుంచి డిసెంబరు 9, 2020 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలని నవీన్ మిత్తల్ అన్నారు. ప్రైవేట్ కాలేజీల్లో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల కోసం డిసెంబరు 5, 2020 న మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.