TS Eamcet 2021 : విద్యార్థులకు అలర్ట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 4 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను మొత్తం ఆరు సెషన్లలో(4,5,6 తేదీలే) నిర్వహిస్తారు. ఇక ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షను ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

TS Eamcet 2021 : విద్యార్థులకు అలర్ట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Ts Eamcet 2021

TS Eamcet 2021 : రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 4 నుంచి ఎంసెట్ ప్రవేశ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను మొత్తం ఆరు సెషన్లలో(4,5,6 తేదీలే) నిర్వహిస్తారు. ఇక ఎంసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షను ఈ నెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.

మొత్తం 105 పరీక్షా కేంద్రాలను(తెలంగాణలో 82, ఏపీలో 23) ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది.

కాగా, ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉంటుందని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. రెండు గంటల ముందే పరీక్ష కేంద్రంలో పలికి అనుమతిస్తామని వెల్లడించారు. హాల్ టికెట్‌పై లొకేషన్ కూడా ఇస్తున్నామన్నారు. విద్యార్థులు ఒక రోజు ముందే ఎగ్జామ్ సెంటర్ తెలుసుకోవాలని అన్నారు.

ఎంసెట్‌లో ఇంటర్ సిలబస్ వెయిటేజ్ లేదని, గతంలో వెయిటేజి ఉండేదని కానీ ఇప్పుడు లేదని తెలిపారు. కోవిడ్‌తో ఇబ్బందులు పడ్డ విద్యార్థులు నష్టపోకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలని, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారం ఉంటుందని విద్యార్థులు ఆరోగ్య అంశాలు ఫిల్ చేసి ఇవ్వాలని చెప్పారు. కోవిడ్ వచ్చిన విద్యార్థుల కోసం పరీక్ష రీషెడ్యూల్ చేస్తామని, లేదంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యార్థులు మాస్కులు ధరించి, చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ప్రయాణ సమయాల్లో భౌతికదూరం పాటిస్తూ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కోరారు.