Dasara Holidays: ఎలాంటి మార్పులు లేవు.. దసరా సెలవులపై క్లారిటీ ఇచ్చిన టీఎస్ విద్యాశాఖ..

దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన పేర్కొన్నారు.

Dasara Holidays: ఎలాంటి మార్పులు లేవు.. దసరా సెలవులపై క్లారిటీ ఇచ్చిన టీఎస్ విద్యాశాఖ..

Dasara Holidays

Dasara Holidays: తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే అతిపెద్ద పండుగల్లో బతుకమ్మ, దసరాకు అని చెప్పొచ్చు. తెలంగాణ సంస్కృతిని చాటే ఈ పండుగలకు రాష్ట్ర అవిర్భావం తర్వాత ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఈ పండుగల సమయంలో ప్రతీయేటా 12 నుంచి 15 రోజుల వరకు సెలవులను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటిస్తుంది. ఈ ఏడాది వచ్చేనెల 5న దసరా పండుగ నేపథ్యంలో ఈనెల 26 నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు దసరా సెలవులను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఏకంగా 15 రోజుల పాటు సెలవులు ఇచ్చింది.

AP Dasara Holidays-2022: ఏపీలో పాఠశాలలకు 26 నుంచి దసరా సెలవులు.. ఎన్నిరోజులంటే..

అయితే.. సెలవులను ఇన్ని రోజుల పాటు ఇవ్వడంపై రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. సెలవులను తగ్గించాలని విద్యాశాఖకు ప్రతిపాదనలను పంపించడంతో పాటు, దసరాకు కేటాయించిన 15 రోజుల సెలవులకు బదులు తొమ్మిది రోజులు మాత్రమే ఇవ్వాలని విద్యాశాఖకు సూచించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో దసరా సెలవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయని, 15రోజులకు బదులు కేవలం తొమ్మిదిరోజులు ( అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 9 వరకు) మాత్రమే సెలువులు ఉంటాయని పుకార్లు షికార్లు చేశాయి. ఈ క్రమంలో తెలంగాణ విద్యాశాఖ బుధవారం దసరా సెలవుల విషయంపై మరోసారి స్పష్టత ఇచ్చింది.

Holidays For Dussehra : ద‌స‌రా పండుగకు ఏయే రాష్ట్రాలు.. ఎన్ని రోజుల సెల‌వులు..!

దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని విద్యాశాఖ బుధవారం స్పష్టం చేసింది. ఇంతకు ముందు ప్రకటించిన ప్రకారమే దసరా సెలవులు ఇవ్వనున్నట్లు విద్యాశాఖ డైరెక్టర్‌ దేవసేన పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్‌ 9వ తేదీ వరకు దసరా సెలవులు కొనసాగుతాయని స్పష్టం చేశారు.