Ambedkar Overseas Vidya Nidhi : విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పధకాల్లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పధకం ఒకటి. ఈ పధకం కింద అర్హులైన షెడ్యూల్డ్ తెగల విద్యార్ధులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోటానికి ప్రభుత్వం రూ.20 లక్షల వరకు ఆర్ధిక సహయం అందిస్తోంది.

Ambedkar Overseas Vidya Nidhi : విదేశాలకు వెళ్లే విద్యార్ధులకు శుభవార్త

Ambedkar Overseas Scheme

Ambedkar Overseas Vidya Nidhi : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పధకాల్లో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పధకం ఒకటి. ఈ పధకం కింద అర్హులైన షెడ్యూల్డ్ తెగల విద్యార్ధులు విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోటానికి ప్రభుత్వం రూ.20 లక్షల వరకు ఆర్ధిక సహయం అందిస్తోంది.

తాజాగా ఈ పధకం కింద అర్హులైన విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవడానికి విధించిన గడువు తేదీని మరింత పెంచారు. ఈ స్కీం కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధి కుటుంబ సభ్యుల సంవత్సర ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలి. అలాగే వయస్సు జూలై 1 నాటికి 35 ఏళ్లు లోపు వారై ఉండాలి.

అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ చేయాలనుకుంటున్న విద్యార్థులు ఈ పధకానికి అప్లై చేసుకోవచ్చు. ఈ పధకం గురించి మరిన్ని వివారాలు తెలుసుకోవాలనుకుంటున్న విద్యార్థులు : telanganaepass.cgg.gov.in ను సందర్శించి అప్లై చేసుకోవచ్చు.