Tamilisai Soundararajan : గవర్నర్ తమిళ్ సై ఢిల్లీ టూర్ వెనుక కారణం ఇదేనా...! | Tamilisai Soundararajan 

Tamilisai Soundararajan : గవర్నర్ తమిళ్ సై ఢిల్లీ టూర్ వెనుక కారణం ఇదేనా…!

తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈ రోజు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఆమె హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్కంఠను

Tamilisai Soundararajan : గవర్నర్ తమిళ్ సై ఢిల్లీ టూర్ వెనుక కారణం ఇదేనా…!

Tamilisai Soundararajan  :  తెలంగాణ గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ ఈ రోజు రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ఆమె హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారు. గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్కంఠను రేపుతోంది. ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య దూరం పెరిగింది.

తెలంగాణలో గవర్నర్ పాత్ర తగ్గింపు,గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదాలు, రాష్ట్రంలో తాజా పరిస్థితులపై హోం మంత్రి అమిత్ షాకు తమిళ్ సై నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.

యాదగిరి గుట్ట ఆలయ ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించలేదు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నఆందోళనలపైన హోంశాఖకు నివేదిక ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : Rains In Telangana : తెలంగాణలో రాబోయే 3 రోజుల్లో వర్షాలు-ఎల్లో అలర్ట్ జారీ

×