గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

  • Published By: srihari ,Published On : May 20, 2020 / 09:41 AM IST
గ్రేటర్ హైదరాబాద్ లో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. జీహెచ్ఎంసీ దాదాపు 98 వేల ఇల్ల నిర్మాణం ప్రారంభించింది.   8,600 ఇళ్ల నిర్మాణం పూర్తి అయింది. ఫినిషింగ్ స్టేజ్ లో 46, 300 ఇళ్లు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై మే 20, 2020 మంత్రి కేటీఆర్ ఉన్నస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, మహబూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ హాజరయ్యారు. నిధుల కొరత ఉన్నప్పటికీ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రులు తెలిపారు. 

హైదరాబాద్ లో మొత్తంగా 98 వేల ఇళ్లకు సంబంధించి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. మొత్తం 9 వేల 500 కోట్ల రూపాయలు ఇందుకోసం ఖర్చు చేయనున్నారు. ప్రధానంగా నిర్మాణంతోపాటు అక్కడ అవరమైన మౌలిక సదుపాయాల సమస్యలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం కోసం అధికారులు శ్రద్ధం తీసుకున్నారు. 

ఇళ్ల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను దేశ వ్యాప్తంగా పలువురుు మెచ్చుకున్నారు. వీటిని వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టు నాటికి 50 వేల ఇళ్ల నిర్మాణం పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు 8 వేలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా మరొక 46 వేల 387 ఇళ్లు పినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయని..వీటిని కూడా పూర్తి చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

Read:వివాహితతో అక్రమ సంబంధం….దారుణ హత్య