Minister KTR : కేటీఆర్ సంచలన ఆరోపణ-రూ.40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్మేందుకు మోదీ సర్కారు యత్నం
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి “కహానీలు” చెపుతున్న మోడీ ప్రభుత్వం, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం బీజీగా ఉందని విమర్శించారు.

Minister KTR : ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి “కహానీలు” చెపుతున్న మోడీ ప్రభుత్వం, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం బీజీగా ఉందని విమర్శించారు.
దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అడ్డికి పావుసేరు అమ్ముతుందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలును పట్టించుకోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు.
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీతో పాటు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునః ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మరోసారి కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్న సోయి ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన సంస్థలను అప్పనంగా అమ్మడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు.
ఇందులో భాగంగానే తెలంగాణలో ఉన్న హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, HMT, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందన్నారు కేటీఆర్. తమ అమ్మకపు ప్రణాళికల్లో కేంద్రం పెట్టిన ఈ అరు సంస్థలకు గతంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 7200 ఎకరాల భూమిని కేటాయించాయన్న కేటీఆర్, ఇప్పుడు ఆ భూముల విలువ ప్రభుత్వ లెక్క ధరల ప్రకారం కనీసం 5వేల కోట్ల రూపాయలపైనే ఉంటుందన్నారు.
బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువ 40 వేల కోట్లు ఉంటుందని కేటీఆర్ తెలిపారు. స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామికాభివృధ్ది జరగాలన్న ఉదాత్తమైన లక్ష్యంతో గతంలో ఆయా కంపెనీలకు అత్యంత తక్కువ ధరకు, అనేక సందర్భాల్లో ఉచితంగానే భూములు కేటాయించిన సంగతిని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే తమ ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు కేటీఆర్.
ఆయా సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో ప్రయివేట్ పరం చేయడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్టుగానే ఇక్కడి ప్రజలు భావిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే వంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ర్టం ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తమిళనాడుతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగంలో ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను అమ్మే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో PSU ల అమ్మకంపైన పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కొనసాగిన ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునరుద్దరణ చేపట్టి వాటిని బలోపేతం చేయాలని సూచించారు. ఇలా చేయకుండా తెలంగాణలోని అయా కంపెనీల ఆస్థులను అమ్మి సొమ్ము చేసుకుని బయటపడతామంటే కచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేకుంటే ఆయా సంస్థలున్న ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.
Also Read : Agnipath : త్రివిధ దళాధిపతులతో సమావేశం అయిన రాజ్‌నాధ్‌సింగ్
- Minister KTR: నేడు ఖమ్మం జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. షెడ్యూల్ ఇలా..
- Ministar KTR: నేడు రెండు జిల్లాల్లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్.. కొస్గీలో భారీ పోలీస్ బందోబస్తు..
- KTR Davos Tour : తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ.. ప్రముఖ కంపెనీలతో కీలక ఒప్పందాలు
- Ministar ktr: నేటి నుంచి మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన.. ఎన్నిరోజులంటే..
- KTR Fires On AmitShah : అమిత్ షా కాదు.. అబద్దాల బాద్ షా, వారివన్నీ తుక్కు మాటలే-కేటీఆర్ ఫైర్
1Cervical Spondylosis: సర్వికల్ స్పాండిలోసిస్ లక్షణాల గురించి తెలుసా..
2IndVsIreland 2ndT20I : సెంచరీ బాదిన దీపక్ హుడా.. ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యం
3World’s Ugliest Dog : ప్రపంచంలో అత్యంత అందవిహీనమైన కుక్క ఇదే.. రూ.లక్ష గెలుచుకుంది
4GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం
5Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
6Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్‌డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే?
7Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
8Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
9Dharmendra Pradhan: అప్పటివరకు బిహార్ సీఎంగా నితీశ్ కుమారే..: ధర్మేంద్ర ప్రధాన్
10Srinivasa Klayanam : సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!