TS Politics : తెలంగాణలో అధికారులు ఓవర్ యాక్షన్ చేయొద్దు..వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే : కిషన్ రెడ్డి

తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారని..ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో అధికారం మాదేనని..అధికారులు ఓవర్ యాక్షన్ చేయవద్దు అంటూ సూచించారు. మండిపడ్డారు.

TS Politics : తెలంగాణలో అధికారులు ఓవర్ యాక్షన్ చేయొద్దు..వచ్చే ఎన్నికల్లో అధికారం మాదే : కిషన్ రెడ్డి

KCR- Minister Kishan reddy : సీఎం కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. ఘాటు వ్యాఖ్యలతో విమర్శల దాడి చేశారు. తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న ప్రజాసంగ్రామయాత్ర మూడో విడత ప్రారంభమైంది. యాదాద్రి మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ పై విమర్శలు కురిపించారు. ఏడాది తర్వాత (వచ్చే ఎన్నికల్లో) మార్పు ఖాయమని..అధికారం బీజేపీదే అని కాబట్టి తెలంగాణలో అధికారులు ఓవర్ యాక్షన్ చేయవద్దని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. కేసీఆర్ కేబినెట్ లో 50శాతం మంది తెలంగాణా ద్రోహులే అంటూ విమర్శించారు కిషన్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారని అటువంటి కేసీఆర్ వద్ద బీజేపీ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణకు సచివాలం లేకుండా చేసిన కేసీఆర్ ఎవ్వరి మాటా వినని నియంత అని..ఆయన ఎవరిని కలవరు అంటూ విమర్శించారు. కేసీఆర్ మజ్లిస్ పార్టీ చేతిలో కీలుబొమ్మలాగా మారి వారు ఆడించినట్లుగా ఆడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. రైతుల గురించి రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను వచ్చే ఎన్నికల్లో ప్రజలు పాతరేస్తారని..హుజూరాబాద్ ఫలితాలే తెలంగాణ అంతటా వస్తాయి అంటూ ధీమా వ్యక్తంచేశారు కిషన్ రెడ్డి.ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు పెడుతున్నామంటూ ఆరోపించే టీఆర్ఎస్ కు.. ఈడీ గురించి మాట్లాడే హక్కు ఉందా? అంటూ ప్రశ్నించారు.

కేసీఆర్ పాలనలో సామాజిక న్యాయం లేదన్నారు కిషన్ రెడ్డి.. కేంద్రానికి వ్యతిరేకంగా కుట్రలు చేసేందుకు మాత్రం టైం ఉంటుందని ఎద్దేవా చేశారు. కేజీ టూ పీజీ విద్య ఏమైందని నిలదీశారు. 24 రోజుల పాటు కొనసాగనున్న బీజేపీ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దర్శనంతో ముగియనుంది. యాదగిరిపల్లి, గాంధీనగర్, గణేశ్ నగర్‌, శుభం గార్డెన్‌, పాతగుట్ట, యాదగిరిగుట్ట ప్రధాన రహదారి, గొల్లగుడిసెలు, దాతారుపల్లి, బస్వాపూర్‌ గ్రామాల్లో పర్యటన సాగనుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కేవలం 15 సీట్లే గెలుస్తుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నాయకత్వం నిర్ణయం ప్రకారం తాను పోటీ చేస్తానని చెప్పారు. తెలంగాణపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్‌ షాకు పూర్తి నమ్మకం ఉందని, కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు.