TSRTC: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆ బస్సెక్కితే స్వామివారి దర్శనం టికెట్..

తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు వెళ్తున్నారా.. దర్శనం టికెట్లు దొరకడం లేదా.. కంగారుపడాల్సిన పనిలేదు. తెలంగాణ నుంచి స్వామివారిని దర్శించుకొనేందుకు వెళ్లే భక్తులకోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.. ఆ సేవలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

TSRTC: తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆ బస్సెక్కితే స్వామివారి దర్శనం టికెట్..

Tsrtc

TSRTC: తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు వెళ్తున్నారా.. దర్శనం టికెట్లు దొరకడం లేదా.. కంగారుపడాల్సిన పనిలేదు. టీఎస్ ఆర్టీసీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తెలంగాణ నుంచి వెళ్లే స్వామివారి భక్తులకోసం ప్రత్యేక సదుపాయాన్ని కల్పిస్తోంది. తిరుమలకు ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బస్సులో తిరుమల తిరుపతి వెళ్లే వారికి స్వామివారి దర్శనం టికెట్ నుసైతం రిజర్వేషన్ చేసుకొనే అవకాశాన్ని కల్పిస్తోంది. శుక్రవారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

TSRTC : రూట్ బస్‌పాస్ చార్జీలు భారీగా పెంచిన టీఎస్ఆర్టీసీ

తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శ్రీవారి దర్శన టోకెన్‌ కూడా పొందే వీలు కల్పించింది. టీఎస్‌ఆర్టీసీ బస్సులో తిరుమలకు టిక్కెట్టు రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే దర్శనం టిక్కెట్టు కూడా బుక్ చేసుకున్న ప్రయాణీకులకు ఈ ప్రత్యేక సదుపాయం అందుబాటులో ఉండనుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ, టీటీడీల మధ్య అంగీకారం కుదిరింది. ప్రతీరోజూ వెయ్యి టికెట్లు ఈ విధానంలో అందుబాటులో ఉంటాయి. శుక్రవారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ సజ్జనార్‌లు తెలిపారు.

TS RTC: బస్ టికెట్ కొంటే.. తిరుమల వెంకటేశ్వరుడి దర్శన టికెట్..

తెలంగాణ నుంచి తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకొనేందుకు వెళ్లే భక్తులు www.tsrtconline.in ఆన్‌లైన్ లేదా టికెట్ బుకింగ్ కౌంటర్లలో ఈ ప్యాకేజీని పొందవచ్చు. అయితే ఇక్కడ ప్రయాణీకులు ఓ విషయాన్ని గమనించాల్సి ఉంది. కనీసం వారం రోజుల ముందుగానే టిక్కెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.