TS School Academic Calendar : ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు సెలవులు, మార్చిలో టెన్త్ పరీక్షలు.. పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ ఖరారు

TS School Academic Calendar : ఏప్రిల్ 24 నుంచి స్కూళ్లకు సెలవులు, మార్చిలో టెన్త్ పరీక్షలు.. పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ ఖరారు

TS School Academic Calendar (Photo : Google)

School Academic Calendar 2023-24 : తెలంగాణ విద్యాశాఖ 2023-24 పాఠశాల విద్యా సంవత్సరం షెడ్యూల్ ను ఖరారు చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం జూన్ 12 నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. 2024 ఏప్రిల్ 24వ తేదీ చివరి పని దినం. 2023-24 విద్యా సంవత్సరంలో 229 పని దినాలు ఉన్నాయి. 2024 జనవరి 10వ తేదీ నాటికి 10వ తరగతి సిలబస్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Also Read..JEE Exam Smart Copying : జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్ కలకలం.. ఇంటర్‌లో టాపరే కీలక సూత్రదారి..!

2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. పని దినాల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగ, ధ్యానం చేయిస్తారు. అక్టోబర్ 14 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయి. జనవరి 12 నుంచి 17 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు ఉంటాయి. 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇస్తారు.