TS-SET-2023: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ సెట్ పరీక్ష వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇదే

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13, 14, 15 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న జరగాల్సిన పరీక్షను 17న నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ ఒక్క రోజు పరీక్షను మాత్రమే వాయిదా వేశారు.

TS-SET-2023: ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ సెట్ పరీక్ష వాయిదా.. కొత్త షెడ్యూల్ ఇదే

TS-SET-2023: తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఎస్ సెట్-2023 (తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష) తేదీలు రీ షెడ్యూల్ అయ్యాయి. దీనిపై ‘టీఎస్ సెట్ సభ్య కార్యదర్శి, ప్రొఫెసర్ మురళీ కృష్ణ తాజా ప్రకటన విడుదల చేశారు.

Nagpur: ప్రాణం తీసిన వయాగ్రా.. రెండు మాత్రలు వేసుకుని వ్యక్తి మృతి

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13, 14, 15 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, తాజాగా సవరించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న జరగాల్సిన పరీక్షను 17న నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో ఈ ఒక్క రోజు పరీక్షను మాత్రమే వాయిదా వేశారు. మిగతా 14, 15 తేదీల్లో నిర్వహించదలచిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలకు పోటీపడే అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను ఈ నెల 10 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సవరించిన షెడ్యూల్ ప్రకారమే ఈ హాల్ టిక్కెట్లు జారీ అవుతాయి.

Neiphiu Rio: నాగాలాండ్ సీఎంగా ఐదోసారి ప్రమాణం చేసిన నీఫియు రియో.. హాజరైన ప్రధాని మోదీ

తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత పరీక్షగా ‘టీఎస్ సెట్’ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరుగుతాయి. గత డిసెంబర్ 30 నుంచి ఈ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష పూర్తి కంప్యూటర్ ఆధారితంగా జరుగుతుంది. టీఎస్ సెట్ కోసం రెండు పేపర్లు ఉంటాయి. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సంబంధిత వెబ్‌సైట్ సంప్రదించాలి.