TSLPRB : టీఎస్ ఎస్సై, కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల
సివిల్, ట్రాన్స్ పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 98,218 మంది ఎంపికయ్యారు. ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు 4564 మంది ఎంపికయ్యారు.

TSLPRB (1)
SI – Constable Exam Results : టీఎస్ ఎస్సై, కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల అయ్యాయి. టీఎస్ కానిస్టేబుల్, ఎస్సై తుది రాతపరీక్ష ఫలితాలను మంగళవారం టీఎస్ఎల్పీఆర్బీ(TSLPRB) విడుదల చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ తుది రాత పరీక్షలో 85.06 శాతం మంది అర్హత సాధించినట్లు వెల్లడించింది.
సివిల్, ట్రాన్స్ పోర్ట్, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు 98,218 మంది ఎంపికయ్యారు. ఐటీ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పోస్టులకు 4564 మంది ఎంపికయ్యారు. సివిల్ ఎస్ఐ పోస్టులకు 43,708 మంది ఎంపికయ్యారు.
ఈ పోస్టులకు సంబంధించి తుది రాత పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్ఎల్పీఆర్బీ వెబ్ సైట్ లో మంగళవారం రాత్రి నుంచి అందుబాటులో ఉంచనున్నారు. ఫైనల్ కీ, ఓఎంఆర్ షీట్లు వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు అవకాశం కల్పించారు.