TSPSC-Group I: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ను గత ఏడాది అక్టోబరు 16న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 22న ఏఈఈ పరీక్ష జరిగింది. గత నెల 26న డీఏవో పరీక్ష నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీ ఇవాళ రద్దు చేసిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నారు. మిగతా రెండు పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

TSPSC-Group I: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

TSPSC-Group I

TSPSC-Group I: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) నిర్ణయం తీసుకుంది. టీఎస్‌పీఎస్సీలో లీకేజీ కేసు సంచలనం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)​ నివేదికను టీఎస్​పీఎస్సీ పరిశీలించింది. అలాగే, అంతర్గత విచారణను కూడా పరిశీలించి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలు రద్దు చేసింది.

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ను గత ఏడాది అక్టోబరు 16న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 22న ఏఈఈ పరీక్ష జరిగింది. గత నెల 26న డీఏవో పరీక్ష నిర్వహించారు. టీఎస్‌పీఎస్సీ ఇవాళ రద్దు చేసిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను జూన్‌ 11న నిర్వహించనున్నారు. మిగతా రెండు పరీక్షల తేదీలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు, టీఎస్‌పీఎస్సీ లీకేజీ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. గత నెల 27న కాన్ఫిడెన్షియల్ రూమ్ నుంచి ప్రశ్నపత్రాలు చోరీ చేశారు.

నిందితుడు ప్రవీణ్ మొత్తం 4 పెన్ డ్రైవ్ లలో సమాచారాన్ని కాపీ చేసుకున్నాడు. ఆ తర్వాతి రోజే రేణుకకు ఏఈ ప్రశ్నపత్రం ప్రింట్ ఇచ్చాడు. ఈ లీకేజీ వ్యవహారంలో సీబీఐతో విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ నేత బల్మూరి వెంకట్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంపై హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాలు పలు ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్నారు.

MLC Election Results 2023: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ హవా..‘జైలు నుండి వచ్చిన సైకోల పాలనకు చరమగీతం’ అంటూ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు