TSPSC Group-1 : జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష

(ఆదివారం) నుంచి హాల్ టికెట్ లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షను ఆఫ్ లైన్ లో, ఓఆర్ఆర్ పద్ధతిలోనే ఉంటుందని స్పష్టం చేసింది.

TSPSC Group-1 : జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష

TSPSC (2)

Group-1 Preliminary Exam : జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగనుంది. జూన్ 11న ఉదయం 10.30 నుంచి 1 వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం టీఎస్పీఎస్సీ ప్రకటించింది. రేపటి (ఆదివారం) నుంచి హాల్ టికెట్ లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ పరీక్షను ఆఫ్ లైన్ లో, ఓఆర్ఆర్ పద్ధతిలోనే ఉంటుందని స్పష్టం చేసింది.

రాష్ట్రంలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గతేడాది ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో అదే ఏడాది అక్టోబర్ 16న పరీక్ష నిర్వహించారు. మొత్తం 3లక్షల 80 వేల 81 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 2లక్షల 85 వేల 916 మంది పరీక్ష రాశారు.

TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. పరీక్షా కేంద్రాల నుంచి కూడా ప్రశ్నాపత్రం లీకైనట్లు నిర్ధారణ

వీరిలో 25 వేల 50 మందిని మెయిన్స్ కు ఎంపిక చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అయితే, అనూహ్యంగా పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగుచూడటంతో రాష్ట్రంలో దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు మరికొన్ని పరీక్షలను రద్దు చేసింది.