TSPSC Notification : తెలంగాణలో మ‌హిళా, శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

తెలంగాణలో మ‌హిళా, శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. 23 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ నెల 13 నుంచి అక్టోబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు.

TSPSC Notification : తెలంగాణలో మ‌హిళా, శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

TSPSC notification

TSPSC Notification : తెలంగాణలో మ‌హిళా, శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. 23 పోస్టుల భ‌ర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. ఈ నెల 13 నుంచి అక్టోబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్‌లో స్వీక‌రించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.

రాష్ట్రంలో 80,039 ఉద్యోగాల పోస్టులను భర్తీ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించినప్పటి నుంచి ఉద్యోగ నియామక ప్రక్రియ చకచకా సాగుతోంది. ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌ ప్రకటించగా కేవలం 5 నెలల్లోనే 65.5 శాతం ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఇప్పటివరకు 52,460 పోస్టులకు ఆర్థికశాఖ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

Government Jobs : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ

రాష్ట్రంలో 20,899 ఉద్యోగాలకు ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. తాజాగా మ‌హిళా శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు 23 ఖాళీల‌తో నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీస్‌, వైద్యారోగ్యశాఖ వంటి కీలక శాఖల్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చింది.

ఇటీవలే గ్రూప్‌-2, గ్రూప్‌-3 ఉద్యోగాలకు సైతం ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల చివరి వారంలో గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులకు సైతం నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ఇదే నెలలో గ్రూప్‌-4 పోస్టులకు సైతం ఆర్థికశాఖ అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం.