TSPSC: టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్ తేదీ ఖరారు

టీఎస్‌పీఎస్‌సీ(తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం సాయంత్రం గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తేదీని ఖరారు చేసింది. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంతో పోలిస్తే గ్రూప్ వన్‌ కోసం ఈసారి భారీగా దరఖాస్తులు అందాయి.

TSPSC: టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఎగ్జామ్ తేదీ ఖరారు

Tspsc

TSPSC: టీఎస్‌పీఎస్‌సీ(తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌) కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం సాయంత్రం గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తేదీని ఖరారు చేసింది. అక్టోబర్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి వివిధ శాఖల్లో 503 గ్రూప్-1 ఉద్యోగాల కోసం టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. గతంతో పోలిస్తే గ్రూప్ వన్‌ కోసం ఈసారి భారీగా దరఖాస్తులు అందాయి. రోజుకు సుమారు పది వేల చొప్పున దరఖాస్తులు అందగా.. గడువు పెంచిన తర్వాత చివరి నాలుగు రోజుల్లో సుమారు 30 వేల మంది దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 503 పోస్టులకు గానూ.. 3 లక్షల 80 వేల 202 మంది పోటీపడుతున్నారు.

ఐదేళ్లు పూర్తి చేసుకున్నTSPSC : 39వేల నేటిఫికేషన్లు విడుదల

గ్రూప్-1 ప్రకటనలో మొత్తం 503 పోస్టుల్లో మహిళలకు 225 రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేసుకో, ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీ పడుతున్నారు. జనరల్ పోస్టుల్లోనూ మెరిటల్ సాధిస్తే మరిన్ని పోస్టులు పొందేందుకు అకాశముంది. దివ్యాంగుల కేటగిరిలో గల 24 పోస్టులకు 6,105 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయితే దరఖాస్తుల దాఖలు గడువు తేదీని పొడగించాలన్న విజ్ఞప్తిని టీఎస్ పీఎస్సీ పట్టించుకోలేదు.

అయితే పరీక్ష తేదీ విషయంలో మాత్రం అభ్యర్థుల విజ్ఞప్తులను మాత్రం పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో జులై, ఆగస్టు నెలలో నిర్వహించాలనుకున్న ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 16న నిర్వహించేందుకు నిర్ణయించింది.