TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై హైకోర్టులో కీలక విచారణ

ఈ కేసును నెల రోజులపాటు సిట్ విచారించింది. ఈ కేసులో 17 మంది నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్ కీలక నిందితులుగా ఉన్నారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై హైకోర్టులో కీలక విచారణ

TSPSC Paper Leak

TSPSC Paper Leak : తెలంగాణ వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం చేపిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసును సిట్ ముమ్మర దర్యాప్తు చేసింది. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటపడ్డాయి. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ తరలించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుపై మంగళవారం హైకోర్టులో కీలక విచారణ జరుగనుంది. సిట్ అధికారులు తమ దర్యాప్తు రిపోర్టును సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందజేయనున్నారు.

ఈ కేసును నెల రోజులపాటు సిట్ విచారించింది. ఈ కేసులో 17 మంది నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్ కీలక నిందితులుగా ఉన్నారు. ఏఈ ఎగ్జామ్, గ్రూప్ 1, డీఏఓ ప్రశ్నాపత్రాలను ప్రవీణ్, రాజశేఖర్ లీక్ చేశారు. సిట్ అధికారులు టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రశ్నించారు. బోర్డు సెక్రటరీ, సభ్యుడి స్టేట్ మెంట్ ను నివేదికలో పొందుపర్చారు. ఎఫ్ఎస్ఎల్ నివేదికను సైతం జత పరిచారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ

మరోవైపు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈసీఐఆర్ కింద కేసు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు ఇప్పటివరకు అరెస్టైన నిందితులందరినీ విచారించాలని భావించారు. ఇందులో భాగంగానే ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ లను కస్టడీ విచారణకు అనుమతించాలని ఈడీ ఇప్పటికే నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.