Bandi Sanjay : వాళ్లు బీజేపీ కాదు బీఆర్ఎస్.. బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయకుండానే ఉద్యోగం ఇచ్చారా-బండి సంజయ్

టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నిందితురాలు రేణుక తల్లి, అన్న బీఆర్ఎస్ నాయకులు అని ఆయన ఆరోపించారు. క్వశ్చన్ పేపర్ లీకేజీకి బీజేపీతో సంబంధం ఏంటి?

Bandi Sanjay : వాళ్లు బీజేపీ కాదు బీఆర్ఎస్.. బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేయకుండానే ఉద్యోగం ఇచ్చారా-బండి సంజయ్

Bandi Sanjay : టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. నిందితురాలు రేణుక తల్లి, అన్న బీఆర్ఎస్ నాయకులు అని ఆయన ఆరోపించారు. క్వశ్చన్ పేపర్ లీకేజీకి బీజేపీతో సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. రాజశేఖర్ బ్యాక్ గ్రౌండ్ తెలియకుండానే ఉద్యోగం ఇచ్చారా? అని నిలదీశారు బండి సంజయ్.

క్వశ్చన్ పేపర్ లీక్ వ్యవహారంలో బీఆఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బండి సంజయ్. పేపర్ లీక్ కేసులో తప్పు జరగనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడానికి అభ్యంతరమేంటని ఆయన ప్రశ్నించారు. పేపర్ లీక్ ఘటనతో 30లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అయ్యాయని బండి సంజయ్ వాపోయారు. అభ్యర్థులంతా రోడ్కెక్కి ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం కనీసం భరోసా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదన్నారు. నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా లిక్కర్ కేసులో కవితను కాపాడుకోవడానికి మంత్రులంతా ఢిల్లీలో మకాం వేశారని బండి సంజయ్ మండిపడ్డారు.

Also Read..Telangana Govt : టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు.. కమిషన్ సభ్యులను మార్చాలని యోచన!

”పేపర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన రేణుక ఫ్యామిలీ బీఆర్ఎస్ లో ఉంది. ఇన్నేళ్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పని చేస్తున్నా వాళ్లను ఎందుకు గుర్తించలేదు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. పక్క రాష్ట్రాలను వదిలేసి ముందు సొంత రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూసుకోవాలి” అని బండి సంజయ్ అన్నారు.

Also Read..TSPSC Paper Leakage Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. వెలుగులోకి రాజశేఖర్ రెడ్డి లీలలు

ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్ కు మహిళా కమిషన్‌ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన కమిషన్‌ ఎదుట శనివారం విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలు తెలంగాణలో మాట్లాడే సాధారణ భాషేనని చెప్పారు. టీఎస్‌పీఎస్సీ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వానికి అభ్యంతరమేంటని ఈ సందర్భంగా ప్రశ్నించారు బండి సంజయ్.