TSPSC Paper Leak : నా భర్తను చూసి షాక్ అయ్యా.. వీడియో బయటపెట్టాలి.. హైకోర్టును ఆశ్రయించిన రాజశేఖర్ భార్య

TSPSC పేపర్ లీకేజీ కేసు నిందితుడు రాజశేఖర్ భార్య సుచరిత తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజశేఖర్ భార్య సుచరిత పిటిషన్ లో కిలక అంశాలు పేర్కొన్నారు. తన భర్తను మార్చి11వ తేదీన పోలీసులు ఆరెస్ట్ చేశారు కానీ, మార్చి14వ తేదీన పోలీసులు రీమాండ్ చేశారని తెలిపారు.

TSPSC Paper Leak : నా భర్తను చూసి షాక్ అయ్యా.. వీడియో బయటపెట్టాలి.. హైకోర్టును ఆశ్రయించిన రాజశేఖర్ భార్య

Sucharita

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు నిందితుడు రాజశేఖర్ భార్య సుచరిత తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజశేఖర్ భార్య సుచరిత పిటిషన్ లో కిలక అంశాలు పేర్కొన్నారు. తన భర్తను మార్చి11వ తేదీన పోలీసులు ఆరెస్ట్ చేశారు కానీ, మార్చి14వ తేదీన పోలీసులు రీమాండ్ చేశారని తెలిపారు. పోలీసులు తన భర్త రాజశేఖర్ ను వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. నేరం ఒప్పుకునేల పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. తన భర్తను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారని చెప్పారు. మీడియా సమావేశంలో తన భర్తను చూసి షాక్ అయ్యానని తెలిపారు.

మీడియా సమావేశం నుండి వెళ్ళేటప్పుడు తన భర్త కుంటుతూ నడుస్తున్నాడని వెల్లడించారు. పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. మెడికల్ చెకప్ నిమిత్తం తన భర్తను హాస్పటల్ లో అడ్మిట్ చేయాలని కోరారు. విచారణ జరుగుతున్న వీడియో గ్రఫీని బయట పెట్టాలన్నారు. తన భర్తను పోలీసులు చిత్ర హింసలకు గురి చేసిన దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు సంస్థతో కేసు విచారణ జరిపించాలన్నారు. తన భర్తఫై పోలీసులు ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో సంచలన విషయాలు.. అక్టోబర్ నుంచే ప్రవీణ్, రాజశేఖర్ ఆధీనంలో TSPSC కంప్యూటర్ వ్యవస్థ

మీడియా సమావేశంలో తన భర్తను చూసి షాక్ అయ్యానని తెలిపారు. మీడియా సమావేశం నుండి వెళ్ళేటప్పుడు తన భర్త కుంటుతూ నడుస్తున్నాడని వెల్లడించారు. పోలీసులు తన భర్తను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. మెడికల్ చెకప్ నిమిత్తం తన భర్తను హాస్పటల్ లో అడ్మిట్ చేయాలని కోరారు. విచారణ జరుగుతున్న వీడియో గ్రఫీని బయట పెట్టాలన్నారు.  తన భర్తను పోలీసులు చిత్ర హింసలకు గురి చేసిన దానిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేక దర్యాప్తు సంస్థతో కేసు విచారణ జరిపించాలన్నారు. తన భర్తఫై పోలీసులు ఎలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. రాజశేఖర్ భార్య దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని హైకోర్టు తెలిపింది. అభ్యంతరాలు ఉంటే సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. విచారణలో ప్రొసీజర్ ఫాలో అవుతున్నామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. తదుపరి విచారణ మంగళవారం (మార్చి21)కి వాయిదా వేసింది.