TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. పరీక్షా కేంద్రాల నుంచి కూడా ప్రశ్నాపత్రం లీకైనట్లు నిర్ధారణ

పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేందుకు రమేష్ మలక్ పేటలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సమాధానాలు చేరవేసేందుకు ప్రతి అభ్యర్థికి ఒక్కో సహాయకుడిని నియమించారు.

TSPSC : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. పరీక్షా కేంద్రాల నుంచి కూడా ప్రశ్నాపత్రం లీకైనట్లు నిర్ధారణ

TSPSC paper leak (2)

TSPSC Paper Leakage : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రతిరోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయం నుండే కాక పరీక్షా కేంద్రాల నుంచి కూడా పేపర్ లీక్ అయినట్టు సిట్ నిర్ధారణ చేసింది. విద్యుత్ శాఖ డీఈఈ రమేష్ లీలలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.

ప్రశ్నాపత్రాలను పరీక్షా కేంద్రం నుండి లీక్ చేయడానికి ఇన్విజిలేటర్ లతో రమేష్ ఒప్పందం కుదుర్చుకున్నారు. AEE, DAO పరీక్షల కోసం హైటెక్ మాస్ కాపియింగ్ కు రమేష్ తెర లేపారు. పరీక్షలకు హాజరైన 11 మంది అభ్యర్థులకు చెవిలో ఇమిడిపోయేలా బఠాణి గింజంతా స్పీకర్ అమర్చినట్టు గుర్తించారు.

TSPSC Paper Leakage : ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం.. ప్రమేయమున్న 37 మంది డిబార్

పరీక్ష అనంతరం చెవిలో నుండి దాన్ని బయటికి తీసేందుకు మ్యాగ్నటిక్ పరికరాన్ని వినియోగించినట్లు నిర్ధారించారు. బనియన్ లో చిన్నపాటి చిప్ తో కూడిన డివైస్ తో పాటు మైక్రోఫోన్ ముఠా అమర్చింది. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ఎలా చేయాలో శిక్షణ ఇచ్చేందుకు రమేష్ మలక్ పేటలో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.

సమాధానాలు చేరవేసేందుకు ప్రతి అభ్యర్థికి ఒక్కో సహాయకుడిని రమేష్ నియమించారు. రమేష్ అండ్ గ్యాంగ్ హైటెక్ కాపీయింగ్ గురించి ఇంటర్నెట్ లో శోధించారు. దీంతో సిట్ బృందం రమేష్ చరిత్రపై ఆరా తీస్తున్నారు. కాగా, ఇప్పటివరకు పేపర్ లీకేజీ కేసులో 43 మందిని అరెస్టు చేశారు. పేపర్ లీకేజీతో సంబంధం ఉన్న 37 మందిని డిబార్ అయ్యారు.