Group-4 Edit Option : గ్రూప్-4లో ఎడిట్ ఆప్షన్.. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం

ఒక అభ్యర్థి తన దరఖాస్తులోని తప్పులను ఒకసారి మాత్రమే సవరించుకునే అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తును పీడీఎఫ్ పార్మాట్ లో పరిశీలించాలని అభ్యర్థులకు సూచించారు.

Group-4 Edit Option : గ్రూప్-4లో ఎడిట్ ఆప్షన్.. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం

Group-4 Edit Option

Group-4 Edit Option : గ్రూప్-4కు దరఖాస్తు చేసుసుకున్న అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్-4 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు అవకాశం కల్పించింది. గ్రూప్-4లో ఎడిట్ ఆప్షన్ ఇచ్చింది. మే9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తుల్లో సవరణలు చేసుకోవచ్చని తెలిపింది.

ఈ మేరకు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక అభ్యర్థి తన దరఖాస్తులోని తప్పులను ఒకసారి మాత్రమే సవరించుకునే అవకాశం ఉందని తెలిపారు. దరఖాస్తును పీడీఎఫ్ పార్మాట్ లో పరిశీలించాలని అభ్యర్థులకు సూచించారు.

TSPSC paper leak: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో కీలక పరిణామం

రాష్ట్రంలోని 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు గత డిసెంబర్ 30వ తేదీన వెలువడిన నోటిఫికేషన్ కు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జులై 1వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.