Group 1 Notification Highlights : ఇంటర్వ్యూలు లేవు.. తొలిసారి EWS, స్పోర్ట్స్ రిజర్వేషన్ అమలు.. గ్రూప్-1 నోటిఫికేష‌న్ హైలైట్స్

2014లో TSPSC ఏర్పడ్డాక విడుదలైన తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్. గ్రూప్-1 సర్వీసుల్లో మొదటిసారి EWS, స్పోర్ట్స్ రిజర్వేషన్ అమలు. ఇంటర్వ్యూలు లేకుండానే ఎంపిక. (Group 1 Notification Highlights)

Group 1 Notification Highlights : ఇంటర్వ్యూలు లేవు.. తొలిసారి EWS, స్పోర్ట్స్ రిజర్వేషన్ అమలు.. గ్రూప్-1 నోటిఫికేష‌న్ హైలైట్స్

Group 1 Notification Highlights

Group 1 Notification Highlights : ఎట్టకేలకు తెలంగాణ నిరుద్యోగుల నిరీక్షణ ఫలించింది. నిరుద్యోగ యువత ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైంది. 503 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వెలువడ్డ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ కావడం విశేషం. ఇటీవలే గ్రూప్స్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్, మెయిన్స్ (రాత పరీక్షలు) రెండు దశల ద్వారానే ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ప్రిలిమ్స్ పరీక్ష మెయిన్స్‌కు అర్హత పరీక్ష మాత్రమే.

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రంగా అవ‌త‌రించాక ఇప్ప‌టిదాకా గ్రూప్ 1 నోటిఫికేష‌నే విడుద‌ల కాలేదు. గ‌డిచిన ఏడేళ్ల‌లో ప‌లు రకాల ఉద్యోగాల కోసం నోటిఫికేష‌న్లు జారీ అయినా.. గ్రూప్ 1 నోటిఫికేష‌న్ మాత్రం జారీ కాలేదు. దీంతో మంగ‌ళ‌వారం జారీ అయిన గ్రూప్ 1 నోటిఫికేష‌న్ ను తెలంగాణ చ‌రిత్ర‌లోనే వెలువ‌డ్డ తొలి గ్రూప్ 1 నోటిఫికేష‌న్‌గా ప‌రిగ‌ణిస్తున్నారు.(Group 1 Notification Highlights)

Group-1 notification: తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ హైలైట్స్:

1. 2014లో TSPSC ఏర్పడ్డాక విడుదలైన తొలి గ్రూప్ -1 నోటిఫికేషన్
2. మొట్టమొదటిసారి భారీ సంఖ్యలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీ
3. 2022 మే 2వ తేదీ నుంచి మే 31 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల స్వీకరణ
4. ఆబ్జెక్టివ్ టైప్ (ప్రిలిమినరీ), రాత పరీక్ష (మెయిన్స్) రెండు రౌండ్లలో గ్రూప్ – 1 ఎగ్జామినేషన్
5. 2022 నవంబర్/డిసెంబర్‌లో జరగనున్న మెయిన్స్ రాత పరీక్ష (కన్వెన్షనల్ టైప్)
6. గ్రూప్-1 పోస్టులకు అప్లై చేసుకునే ముందే TSPSC OTRలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి. లేదా కొత్త రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం OTRను అప్ డేట్ చేసుకోవాలి.
7. నోటిఫికేషన్ తేదీ నాటికి గ్రూప్-1 విద్యార్హతలన్నీ కలిగి ఉండాలి.
8. గ్రూప్-1 సర్వీసుల్లో మొదటిసారి EWS, స్పోర్ట్స్ రిజర్వేషన్ అమలు
9. రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగా మల్టీజోన్ల వారీగా ఒక్కో పోస్టుకు 50మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక.
10. తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు.. మొదటిసారి ఉర్దూలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్.
11. తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు.. మొదటిసారి ఉర్దూలో మెయిన్స్ ఎగ్జామ్ పేపర్.
12. మెయిన్స్‌లో అభ్యర్థులకు ప్రింటెడ్‌కు బదులు ఈ-క్వశ్చన్ పేపర్.
13. సెలెక్షన్ ప్రాసెస్ వేగవంతం చేసేందుకు మెయిన్స్‌లో డిజిటల్ ఎవాల్యుయేషన్

ఇకపోతే గ్రూప్ 1 ఉద్యోగాల భ‌ర్తీలో భాగంగా ఇంట‌ర్వ్యూల‌ను ఎత్తివేస్తున్న‌ట్లు టీఎస్‌పీఎస్సీ త‌న నోటిఫికేష‌న్‌లో ప్ర‌క‌టించింది. కేవ‌లం ప్రిలిమ్స్‌, మెయిన్స్ రాత ప‌రీక్ష‌ల ఆధారంగానే అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల‌ని సూచించింది. మే 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు అనుమతి ఇచ్చింది. జూలై లేదా ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్షలు జరిగితే, ఇదే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. ప్రిలిమ్స్ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) 150 మార్కులకు జరిగితే, మెయిన్స్ పరీక్ష 900 మార్కులకు ఉంటుంది. మెయిన్స్‌లో ఇంగ్లీష్ (అర్హత పరీక్ష)తో పాటు మరో ఆరు సబ్జెక్టులు ఉంటాయి.(Group 1 Notification Highlights)

ఇక గ్రూప్ 1లో ప్ర‌కటించిన ఉద్యోగాల్లో కేట‌గిరీల వారీగా ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి..

డిప్యూటీ కలెక్టర్ (సివిల్ సర్వీసెస్, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) – 42
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీలు) (కేటగిరీ-2) – 91
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్(సీటీవో) – 48
రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్(ఆర్టీఓ) – 4
డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్(జిల్లా పంచాయ‌తీ ఆఫీస‌ర్లు) – 5
డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్(జిల్లా రిజిస్ట్రార్లు)-5
డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ (మెన్) – 2
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ – 8
అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ – 26
మున్సిపల్ కమిషనర్ (గ్రేడ్ 2) – 41
అసిస్టెంట్ డైరెక్టర్-డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 3
డిస్ట్రిక్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ – 5
డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ – 2
డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ – 2
ఏఓ లే సెక్రటరీ & ట్రెజరర్ (గ్రేడ్ 2)- 20
అసిస్టెంట్ ట్రెజరర్/అకౌంట్స్/లెక్చరర్ – 38
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ – 40
మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ – 121(Group 1 Notification Highlights)