TSPSC Notifications : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో వరుస నోటిఫికేషన్లు

తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతమైంది. 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే రాష్ట్రంలో ఉద్యోగాల కోలాహలం కనిపిస్తోంది. ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ వరుసగా అనుమతులిస్తుంటే.. ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి.

TSPSC Notifications : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో వరుస నోటిఫికేషన్లు

TSPSC notifications

TSPSC Notifications : తెలంగాణలో ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతమైంది. 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచే రాష్ట్రంలో ఉద్యోగాల కోలాహలం కనిపిస్తోంది. ఖాళీ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ వరుసగా అనుమతులిస్తుంటే.. ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్‌-1, పోలీస్‌, వైద్యారోగ్యశాఖతోపాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ తదితర పోస్టులకు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. వీటిలో పోలీస్‌, గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. పోలీసుకు సంబంధించి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు డిసెంబర్‌ 8 నుంచి దేహ దారుఢ్య పరీక్షలు జరగనున్నాయి. ఇకపోతే గ్రూప్‌-1 మెయిన్స్‌ను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్‌సీ గతంలోనే చెప్పిన విషయం తెలిసిందే.

ఇప్పటివరకు 80,039 ఉద్యోగాల్లో 61,804 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. మిగిలిన మరో 18,235 ఉద్యోగాలకు సైతం త్వరలోనే అనుమతి లభించనుంది. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా టీఎస్‌పీఎస్‌సీ వరుస నోటిఫికేషన్లు ఇస్తుంది. ఇందులో భాగంగానే డిసెంబర్‌లో మరో మూడు కీలక ప్రకటనలు చేయనుంది. గ్రూప్‌-2, 3, 4 నోటిఫికేషన్లు మూడు డిసెంబర్ లో జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. గ్రూప్‌-2, 3, 4కి సంబంధించి ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి ఇవ్వడంతో భర్తీ ప్రక్రియను టీఎస్‌పీఎస్‌సీ వేగవంతం చేసింది. గ్రూప్‌-2లో భాగంగా 726 ఉద్యోగాలు, గ్రూప్‌-3లో 1,373 ఉద్యోగాలు, గ్రూప్‌-4లో 9,168 ఉద్యోగాలు భర్తీ చేయనుంది.

KTR Wipro : తెలంగాణలో విప్రో యూనిట్ ప్రారంభం.. 90శాతం ఉద్యోగాలు స్థానికులకే

ఇదిలావుండగా గ్రూప్‌-2, 3, 4లో కొత్తగా కొన్ని పోస్టులను చేరుస్తూ.. ఈ నెల 24వ తేదీన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ -2లో మరో 6 రకాల పోస్టులు, గ్రూప్‌ -3లో మరో 2, గ్రూప్‌ -4లో మరో 4 రకాల పోస్టులను చేర్చింది. గ్రూప్‌ -2లో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్‌వో, జువైనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రొబేషనరీ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు కూడా ఉంటాయి.

గ్రూప్‌-3లో గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్‌, హెచ్‌వోడీల్లోని సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులను చేర్చింది. గ్రూప్‌-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, జువైనల్‌ సర్వీసెస్‌ సూపర్‌వైజర్‌ మేల్‌, జువైనల్‌ సర్వీసెస్‌ మ్యాట్రన్‌ స్టోర్‌కీపర్‌, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్‌ పోస్టులను చేర్చింది. గతంలో గ్రూప్‌-2లో 663 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇవ్వగా.. తాజా చేర్పుల అనంతరం ఆ సంఖ్య 726కు చేరింది. గ్రూప్‌-3లో సైతం పోస్టుల సంఖ్య పెరిగే అవకాశముంది.

NHRIMH Recruitment : నేషనల్ హోమియోపతి రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ మెంటల్ హెల్త్ లో ఉద్యోగాల భర్తీ

ఉద్యోగ నియామక ప్రక్రియలో టీఎస్‌పీఎస్‌సీ ప్రణాళికతో ముందుకెళ్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా అడుగులు వేస్తోంది. కొత్తజోనల్‌ వ్యవస్థ ప్రకారం 95శాతం స్థానిక కోటా, రిజర్వేషన్లు తదితరాలు అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తోంది. జిల్లా, జోనల్‌, మల్టీజోనల్‌ స్థాయిలో అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ఆయా శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మరోసారి సరిచూసుకున్న తర్వాతే నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. డిసెంబర్‌, జనవరి, ఫిబ్రవరిలోనే వీలైనన్ని పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది.

ఉద్యోగ నియామక ప్రక్రియను టీఎస్‌పీఎస్‌సీ శరవేగంగా చేపడుతుంది. గ్రూప్‌-4కి ఆర్థికశాఖ శుక్రవారం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా.. మరుసటిరోజే కమిషన్‌ భేటీ అయ్యింది. సోమవారం గ్రూప్‌-4కి సంబంధించి సుమారు 30 శాఖల అధికారులతో టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్‌ సమావేశం కానున్నారు. ఆ తర్వాత కూడా వరుసగా మూడు, నాలుగు రోజలు వివిధ శాఖాధిపతులతో సమావేశాలు నిర్వహిస్తారు.

TSPSC: తెలంగాణ నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్

మొత్తం 94 శాఖల అధికారులతో దశల వారీగా సమావేశాలు నిర్వహించి, గ్రూప్‌-2, 3, 4కి సంబంధించిన ఖాళీలు, ఇండెంట్లు, రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లు తదితర అంశాల గురించి చర్చిస్తారు.నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా ప్రస్తుత సర్వీసు రూల్స్‌ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఆయా శాఖల్లో ఖాళీలు తదితర విషయాలతో కూడిన సమగ్ర సమాచారంతో అధికారులు టీఎస్‌పీఎస్‌సీకి ఇండెంట్లు సమర్పిస్తారు. అవన్నీ సరిచూసుకుని నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు.