TSRTC : అదనపు చార్జీలు లేకుండానే అదరగొట్టిన ఆర్టీసీ.. అనుకున్న దానికంటే రూ.3 కోట్లు ఎక్కువే

తెలంగాణ ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయం సమకూర్చుకుంది. దసరా పండుగ సందర్బంగా నడిపిన సాధారణ, ప్రత్యేక బస్సుల ద్వారా ఆర్టీసీ 66 కోట్ల 54 లక్షల ఆదాయం రాబట్టింది

TSRTC : అదనపు చార్జీలు లేకుండానే అదరగొట్టిన ఆర్టీసీ.. అనుకున్న దానికంటే రూ.3 కోట్లు ఎక్కువే

Tsrtc

TSRTC : తెలంగాణ ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయం సమకూర్చుకుంది. దసరా పండుగ సందర్బంగా నడిపిన సాధారణ, ప్రత్యేక బస్సుల ద్వారా ఆర్టీసీ 66 కోట్ల 54 లక్షల ఆదాయం రాబట్టింది. అక్టోబర్ 11 నుంచి 17 మధ్య ఈ మొత్తం రాబట్టింది ఆర్టీసీ. పండుగ వేళ.. ప్రొమోషన్ చేయడంలో ఆర్టీసీ అధికారులు విజయం సాధించారు. దీంతో ఇతర రవాణా సౌకర్యలద్వారా ఇళ్లకు వెళ్లాలనుకున్న ప్రయాణికులు కూడా ఆర్టీసీ బస్సు ఎక్కేసారు.

చదవండి : TSRTC : ఆర్టీసీలో సజ్జనార్ మార్క్.. బస్టాండ్‌లో స్టాళ్లపై కొరడా

ఇక దసరా ప్రత్యేక బస్సుల ద్వారా ఐదుకోట్ల ఆదాయం రాబట్టాలని అంచనా వేశారు అధికారులు.. అయితే వారు అంచనావేసిన దానికంటే రూ.3 కోట్లు అధికంగా వచ్చాయి. దసరా సీజన్‌లో ప్రత్యేక బస్సుల ద్వారా రూ.8 కోట్ల ఆదాయం వచ్చిపడి. అదనపు చార్జీలు లేకుండానే ఈ మొత్తం రాబట్టింది ఆర్టీసీ. దీంతో సంస్థ ఎండీ సజ్జనార్‌తోపాటు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి : TSRTC : దసరా పండుగ, ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవ్