Medaram Jatara : మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక యాప్

ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసి గిరిజన జాతర... తెలంగాణలోని ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక యాప్ ను రూపోందించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

Medaram Jatara : మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక యాప్

Medaram Sammakka Saralamma Jatara

Medaram Jatara :  ఆసియా ఖండంలోనే అతి పెద్ద ఆదివాసి గిరిజన జాతర… తెలంగాణలోని ప్రసిద్ధ మేడారం సమ్మక్క సారక్క జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక యాప్ ను రూపోందించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. మేడారం విత్ టిఎస్ ఆర్టీసీ పేరుతో ప్రత్యేక యాప్ ను  ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చామని ఆయన పేర్కోన్నారు. ఆర్టీసీ చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా యాప్ రూపొందించామని సజ్జనార్ చెప్పారు. మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీవరకు జరగుతుంది.

మేడారం జాతర సందర్భంగా గతేడాది 19,09,838 మందిని వివిధ గమ్యస్ధానాలకు చేర్చామని సజ్జనార్ వివరించారు. ఈ ఏడాది ఇంతవరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 523 బస్సులను 1,250 ట్రిప్పులను మేడారానికి నడిపాం అని అన్నారు. ఈనెల 13 నుంచి పెరిగే భక్తల రద్దీ తట్టుకునేందుకు బస్సులు సిధ్దం చేశామని 30 మంది ప్రయాణికులు ఉంటే వారి కోసం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

మేడారంలో 50 ఎకరాల్లో బేస్ క్యాంపు, తాత్కాలిక బస్టాండ్ ఏర్పాటు చేసామని..7,400 మీటర్ల క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ వివరించారు. వరంగల్ నుంచి 2 వేల బస్సుల్లో కండక్టర్ లేకుండా సర్వీసులు నడిపిస్తున్నామని ఆయన అన్నారు. అమ్మవార్ల గద్దెల వరకు ఆర్టీసీ బస్సులు నడుస్తాయని.. అమ్మవారి దర్శనం తొందరగా అయ్యేందుకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు.

Also Read :Indian Cost Guard Jobs : ఇండియన్ కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మేడారం లో ఉచిత షటల్ సర్వీసులు అందుబాటులో పెట్టామని ఆర్టీసీ ఎండీ తెలిపారు. మేడారం జాతరను ఆదాయం తెచ్చిపేట్టే జాతరగా కాకుండా ఒక సామాజిక సేవ, సామాజిక   బాధ్యతగా  ఆర్టీసీ భావించి భక్తులకు సౌకర్యాలు కల్పిస్తోందని సజ్జనార్ అన్నారు.