TSRTC : ఆర్టీసీకి లాభాల పంట

తెలంగాణ ఆర్టీసీ రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసుకుంది. సోమవారం 77 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేసుకుంది.

TSRTC : ఆర్టీసీకి లాభాల పంట

Tsrtc

TSRTC :  తెలంగాణ ఆర్టీసీ రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ రేషియోను నమోదు చేసుకుంది. సోమవారం 77 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు చేసుకుంది. కోవిడ్ ప్రభావం మొదలయ్యాక ఇదే అత్యధికం. సాధారణంగా సోమవారాల్లో ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రోజుతో పోలిస్తే కొంత ఆదాయం ఎక్కువగానే వస్తుంది.

చదవండి : TSRTC : అద్భుతమైన పాట పాడిన ఆర్టీసీ డ్రైవర్..ట్వీట్ చేసిన సజ్జనార్

సోమవారం ఆర్టీసీ రూ.12.89 కోట్ల ఆదాయాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.14.07 కోట్ల ఆదాయం నమోదైంది. 10 రీజియన్లలో లక్ష్యానికి మించి ఆదాయం వచ్చినట్లుగా ఆర్టీసీ అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రూ.75.52 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో కలిపి 85.84 శాతం నమోదైంది. ఆర్టీసీ లాభాల బాటలో బయనిస్తుండటంతో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి : TSRTC : ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లకు హెచ్చరికలు, భారీ జరిమాన..ఒప్పందం రద్దు!