TSRTC : టీఎస్‌ఆర్టీసీ బోర్డు మీటింగ్.. కీలక నిర్ణయాలు

త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడుతామని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల నుంచి సుమారు 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని...

TSRTC : టీఎస్‌ఆర్టీసీ బోర్డు మీటింగ్.. కీలక నిర్ణయాలు

Tsrtc

TSRTC Governing Board Meeting : టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ఎన్నో ఒడిదుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నా.. ఏదో రూపంలో సంస్థను ఆర్థిక కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. దీంతో చాలా రోజుల తరువాత తొలిసారి టీఎస్‌ ఆర్టీసీ బోర్డు సమావేశమైంది. 300 అంశాలపై బోర్డు మీటింగ్‌లో చర్చించారు. 2022, ఏప్రిల్ 23వ తేదీ శనివారం ఈ మీటింగ్ జరిగింది. సంస్థ పాలకమండలి సమావేశంపై.. సర్వత్రా ఆసక్తి నెలకొంది. తీవ్ర ఒడిదుడుకుల మధ్య నడుస్తున్న టీఎస్‌ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు .. ఈమధ్యే ప్రభుత్వం ఆర్టీసీకి పూర్తిస్థాయి.. చైర్మన్, ఎండీని నియమించింది. బోర్డ్ ఏర్పాటు చేసిన తరువాత తొలిసారి మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.

Read More : Minister Harish Rao : చనిపోయిన తర్వాత అవయవదానం ద్వారా మరొకరికి జీవితం ఇవ్వొచ్చు : మంత్రి హరీష్ రావు

త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడుతామని సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకటించారు. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల నుంచి సుమారు 1200 మందికి ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడించారు. దీనిపై వచ్చే వారం రోజుల్లో కచ్చితమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని, డీజిల్ సెస్, టోల్ సెస్ పై ప్రజల నుంచి వ్యతిరేకత రాకపోవడం వల్లే.. బోర్డు అనుమతి పొందినట్లు తెలిపారు. ప్రస్తుతం సంస్థను నష్టాల బాట నుంచి బయటపడేసే మార్గాలపై దృష్టి సారించినట్లు, వాణిజ్య భవనాల ద్వారా ఆదాయం పొందే ప్రణాళికపై సమావేశంలో చర్చించినట్లు బాజిరెడ్డి తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా జిల్లాల్లోనూ ప్రవేవపెడుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. త్వరలో 1060 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు టెండర్లు వేయడం జరిగిందన్నారు.

Read More : hyderabad: బంజారాహిల్స్ భూ కబ్జా కేసు.. నిందితుల కోసం గాలింపు

కొత్త బస్సుల కొనుగోలు, ఇటీవల అమల్లోకి తెచ్చిన సెస్‌లు, ఆర్టీసీ సొంతంగా ఏర్పాటు చేసుకున్న నర్సింగ్ కళాశాల, ఆర్టీసీ కార్గో అండ్ పార్సిల్ సర్వీసు ఏర్పాటు, సొంత స్థలాల్లో ప్రారంభించిన పెట్రోల్ బంకులు.. ఇలా చాలా అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏడేళ్ల పద్దులకు కూడా ఆమోదముద్ర పడాల్సి ఉంది. టీఎస్‌ ఆర్టీసీకి.. రోజు రోజుకు పెరుగుతున్న డిజిల్ ధరలు భారంగా మారాయి. దీంతో ఇటీవల కాలంలో సెస్‌ల పేరుతో ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తోంది. అయితే పెడుతున్న ఖర్చుకు వస్తున్న ఆదాయంలో చాలా వ్యత్యాసం ఉండడంతో .. మరోసారి చార్జీల పెంపుపై కసరత్తు చేస్తున్నట్లు, వీటితోపాటు ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపైనా దృష్టి సారించడంపై .. ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.