TSRTC : గప్ చుప్‌‌గా ఆర్టీసీ చార్జీల పెంపు.. ఎంత పెంచారంటే

ఆర్టీసీ చార్జీలను గప్ చుప్ గా పెంచేశారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చేశాయి. ఏ మాత్రం ఓ ప్రకటన జారీ చేయకుండా, ఎలాంటి విషయం చెప్పకుండానే చార్జీలను...

TSRTC : గప్ చుప్‌‌గా ఆర్టీసీ చార్జీల పెంపు.. ఎంత పెంచారంటే

Tsrtc

TSRTC Bus Charges Hike : ఆర్టీసీ చార్జీలను గప్ చుప్ గా పెంచేశారు. శుక్రవారం తెల్లవారుజామునుంచే పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చేశాయి. ఏ మాత్రం ఓ ప్రకటన జారీ చేయకుండా, ఎలాంటి విషయం చెప్పకుండానే చార్జీలను పెంచేయడం గమనార్హం. బస్సు ఎక్కిన ప్రయాణీకులు షాక్ తిన్నారు. ఎంత పెంచారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ప్రతి 2 నుంచి 6 కిలోమీటర్లకు రూ. 5 పెంచారు. ఆర్డినరీ బస్సుల్లో మొదటి నాలుగు స్టేజీలు, మెట్రోలో మొదటి 2 స్టేజీల వరకు ధరలను యదాతథంగా ఉంచారు. సాధారన చార్జీల పెంపు కాకుండా సేప్టీ రూపంలో వీటిని పెంచడం విశేషం. ప్రమాదాలు, వాహనాల బీమా, విపత్తులు తదితర అవసరాల దృష్ట్యా ఆర్టీసీ మూల నిధి కోసం కొత్తగా భద్రతా సెస్ చార్జీలను విధించినట్లు అధికారులు వెల్లడించారు.

Read More : TSRTC : సజ్జనార్ కీలక నిర్ణయం, మహిళల సురక్షితం కోసం ప్రత్యేక యాప్

ప్రతి మూడు, నాలుగు స్టేజీలకు రూ. 5 చొప్పున పెంచారు. మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ మూడో స్టేజీల నుంచి రూ. 5 చొప్పున పెరిగాయి. మెట్రో బస్సుల్లో మొదటి రెండు స్టేజీలు, ఆర్డినరీ బస్సుల్లో మొదటి నాలుగు స్టేజీలు ప్రయాణించే వారు సుమారు 4 నుంచి 5 లక్షల మంది మాత్రమే ఉంటారని, మిగతా ప్రయాణీకుల విషయంలో అదనపు భారం పడనుందని అంచనా. పల్లె వెలుగు బస్సుల్లో 15 కిలోమీటర్ల ప్రయాణానికి రూ. 13 చార్జీ ఉంటే.. దానిని రూ. 15కి పెంచారు. అదే బస్సులో 25 కి.మీటర్లు ప్రయాణం చేస్తే రూ. 21 ఉన్న ధరను రూ. 20గా నిర్ణయించారు. ఒక స్టేజీలో రూపాయి తగ్గించి.. మరో స్టేజీలో రెండు రూపాయల మేర పెంచారు. సిటీ ఆర్డినరీ బస్సులో ఐదో స్టేజీ నుంచి రూ. 20గా నిర్ణయించారు. ఆరో స్టేజీలో టికెట్ తీసుకుంటే.. రూ. 25 చెల్లించాల్సి ఉంటుంది. ఆరో స్టేజీ నుంచి 9వ స్టేజీ వరకు ఇదే ధర వర్తించనుంది. పదో స్టేజీలో టికెట్ ధర రూ. 25 ఉంటే.. దానిని రూ. 30కి పెంచేశారు. మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల స్టేజీల సంఖ్యను తగ్తించి పెంపును వర్తింప చేసినట్లు తెలుస్తోంది.

Red More : TSRTC: డీజిల్ బస్సులపై టీఎస్‌ఆర్టీసీ ప్రయోగాలు.. ఎలక్ట్రిక్‌గా మార్చే ఆలోచన!

మెట్రో డీలక్స్ బస్సులో

మొదటి 2 కి.మీ వరకు (రూ. 15) ఎలాంటి మార్పు లేదు. 4 కి.మీ వరకు రూ. 15 నుంచి రూ. 20కి పెంపు. 6 కి.మీ నుంచి 12 కి.మీ వరకు రూ. 20 నుంచి రూ. 25కి పెంపు. 8వ స్టేజీ నుంచి రూ. 25 నుంచి రూ. 30, ఆ తర్వాత రెండు స్టేజీలకు రూ. 30 నుంచి రూ. 35 చొప్పున పెంచారు. అనంతరం వచ్చే రెండు స్టేజీల వరకు రూ. 40 నుంచి రూ. 45కి పెంపు. 18వ స్టేజీ నుంచి రూ. 45 ఉన్న ధరను రూ. 50కి పెంపు.

మెట్రో ఎక్స్ ప్రెస్ లో : మూడో స్టేజీ వరకు రూ. 15 ఉన్న చార్జీని రూ. 20కి పెంపు. 8 కి.మీ నుంచి 14 కి.మీ వరకు రూ. 20 నుంచి రూ. 25కి పెంపు. 16 కి.మీ నుంచి 24 కి.మీ వరకు రూ. 25 నుంచి రూ. 30, ఆ తర్వాత నాలుగు స్టేజీలకు రూ. 30 నుంచి రూ. 35 చొప్పున పెంచారు. 36 కి.మీ నుంచి 40 కి.మీ వరకు రూ. 35 నుంచి రూ. 40కి పెంపు.

ఆర్డినరీలో :
మొదటి రెండు స్టేజీలకు ప్రస్తుతం ఉన్న రూ. 10 చార్జీని పెంచలేదు. మరో రెండు స్టేజీల వరకు రూ. 15 చార్జీ యథావిధిగా ఉంటుంది. 10 కి.మీ తర్వాత చార్జీలను పెంచేశారు. 5వ స్టేజీ నుంచి రూ. 5 అదనంగా వడ్డించారు. 5వ స్టేజీల వరకు రూ. 15 ఉన్న చార్జీని రూ. 20కి పెంపు. 6వ స్టేజీ నుంచి 9వ స్టేజీ వరకు రూ. 20 నుంచి రూ. 25కి పెంపు. 10వ స్టేజీ రూ. 30కు పెంపు. 15వ స్టేజీ నుంచి 19వ స్టేజీ వరకు రూ. 30 చార్జీని రూ. 35కు పెంచారు. 20వ స్టేజీ రూ. 35 ఉన్న చార్జిని రూ. 40కి పెంపు.