Garuda Plus : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బ‌స్సు ఛార్జీలు త‌గ్గింపు

ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్ర‌యాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది.

Garuda Plus : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బ‌స్సు ఛార్జీలు త‌గ్గింపు

Tsrtc Garuda Plus

Garuda Plus : ప్రయాణికులకు మరింత దగ్గరయ్యేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్ర‌యాణికుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. గ‌రుడ ప్ల‌స్ బస్ ఛార్జీలు త‌గ్గించింది. ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా స‌వ‌రించారు. దీంతో ప్రయాణీకులు ఎంచక్కా రాజధాని ఛార్జీతో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చని ఆర్టీసీ స్పష్టం చేసింది. ప్ర‌యాణికుల‌కు మరింత చేరువ అయ్యేందుకు, విలాసవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ తెలిపింది.

Google Account : మీ గూగుల్ అకౌంట్లో డేటా భద్రమేనా? ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి..!

హైదరాబాద్-విజయవాడ మధ్య రూ.100, హైదరాబాద్-ఆదిలాబాద్ మధ్య రూ.111, హైదరాబాద్-భద్రాచలం మధ్య రూ. 121, హైదరాబాద్-వరంగల్ మధ్య రూ.54 తగ్గిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

Weight : బరువు సులభంగా తగ్గాలంటే?

అయితే, స‌వ‌రించిన ఛార్జీలు.. ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు మాత్రమే వర్తించనున్నాయి. కాగా, అంతరాష్ట్ర సర్వీసుల్లో అయితే తెలంగాణ సరిహద్దు దాటిన తర్వాత అంతకు ముందున్న‌ అంతరాష్ట్ర భాగంలో వర్తించే ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇక కర్నాటక ఆర్టీసీతో సమానంగా ప్లెక్లీ ఛార్జీలు అమల్లో ఉన్న హైదరాబాద్-బెంగళూరు మార్గంలో నడిచే ఏసీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదు. రవాణ రంగంలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడేందుకు ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంస్థ ఎండీ సజ్జనార్ అన్నారు.