TSRTC: నేటి నుంచి తెలంగాణలో టీఎస్ఆర్‌టీసీ స్లీపర్ క్లాస్ బస్సు సర్వీసులు ప్రారంభం

‘లహరి’ పేరుతో ఈ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కేపీహెచ్‌బీ కాలనీలోని బస్ స్టాప్ వద్ద బుధవారం సాయంత్రం ఈ సర్వీసుల్ని టీఎస్ఆర్‌టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రారంభిస్తారు. మొత్తం పది బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి.

TSRTC: నేటి నుంచి తెలంగాణలో టీఎస్ఆర్‌టీసీ స్లీపర్ క్లాస్ బస్సు సర్వీసులు ప్రారంభం

TSRTC: బస్సు ప్రయాణికులకు టీఎస్ఆర్‌టీసీ మెరుగైన సేవల్ని అందించబోతుంది. బుధవారం (జనవరి 4) నుంచి స్లీపర్ క్లాస్ బస్సుల్ని ప్రవేశపెట్టనుంది. ‘లహరి’ పేరుతో ఈ బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కేపీహెచ్‌బీ కాలనీలోని బస్ స్టాప్ వద్ద బుధవారం సాయంత్రం ఈ సర్వీసుల్ని టీఎస్ఆర్‌టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రారంభిస్తారు.

Air India Flight : ఎయిర్ ఇండియా విమానంలో వృద్ధురాలిపట్ల ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన.. సిబ్బంది ఏం చేశారంటే..

మొత్తం పది బస్సులు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ పదింటలో నాలుగు బస్సులు పూర్తిగా స్లీపర్ బస్సులు. మిగతా ఆరు.. స్లీపర్ కమ్ సీటర్ బస్సులు. ఈ బస్సులు హైదరాబాద్ నుంచి కాకినాడ, హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ప్రయాణం సాగిస్తాయి. ఇప్పటివరకు స్లీపర్ క్లాస్ బస్సులు ప్రైవేటు ట్రాన్స్‌పోర్టులోనే ఉన్నాయి. అయితే, మొదటిసారి ప్రభుత్వం రంగ సంస్థ అయిన టీఎస్ఆర్‌టీసీ స్లీపర్ బస్సుల్ని తీసుకొస్తోంది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్లే బస్సులు బీహెచ్ఈఎల్ నుంచి ప్రతి రోజూ రాత్రి 07.45, 08.30 గంటలకు బయల్దేరుతాయి. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు ప్రతి రోజూ రాత్రి 07.15 గంటలకు, 07.45 గంటలకు బయల్దేరుతాయి.

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో ట్విస్ట్ .. తెరపైకి సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్ గొరకవి

హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే బస్సులు ప్రతిరోజూ మియాపూర్ నుంచి ఉదయం 09.30 గంటలకు, 10.45 గంటలకు, 11.45 గంటలకు, రాత్రి 9.30 గంటలకు, 10.15గంటలకు, 11.15 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులు ప్రతి రోజూ ఉదయం 10.15 గంటలకు, 11.15 గంటలకు, మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00 గంటలకు, 12.45 గంటలకు బయల్దేరుతాయి.