TSRTC : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊళ్లకు వెళ్లిన వారి కోసం 3,500 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.

TSRTC : సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్

Tsrtc (1)

TSRTC special buses : హైదరాబాద్ లో నివసించే వారిలో చాలా మంది సంక్రాంతి పండగకు తమ తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. అయితే నేటితో సంక్రాంతి పండగా పూర్తికావడంతో సొంత ఊళ్లకు వెళ్లిన ప్రయాణికులు తిరిగి హైదరాబాద్ కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇవాళ్టి నుంచి మళ్లీ హైదరాబాద్ కు తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ 110 రైళ్లను ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. సొంత ఊళ్లకు వెళ్లిన వారి కోసం 3,500 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

MMTS Trains Cancel : రేపు 36 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

అంతేకాకుండా హైదాబాద్ లో నివసిస్తున్న ఆయా గ్రామాలకు చెందిన వారు సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్లేందుకు కూడా ఆర్టీసీ పత్యేక బస్సులను కేటాయించింది. సంక్రాంతి పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ 4940 ప్రత్యేక బస్సులు నడిపంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సులు నడిపిన విషయం తెలిసిందే.