Bharat Bandh : తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు బంద్

ఈ నెల 27న భారత్ బంద్. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 తర్వాత టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనుంది. జిల్లాల మధ్య బస్సు సర్వీసులు యథాతథంగా నడుస్తాయని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. కేవలం తెల

Bharat Bandh : తెలంగాణ నుంచి ఏపీకి బస్సులు బంద్

Tsrtc

TSRTC : ఈ నెల 27న భారత్ బంద్. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12 తర్వాత టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు నడపనుంది. జిల్లాల మధ్య బస్సు సర్వీసులు యథాతథంగా నడుస్తాయని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. కేవలం తెలంగాణ పరిధిలోనే కాకుండా ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులనూ నిలిపివేయడం లేదని వెల్లడించింది.

Lock Facebook: ఫేస్‌బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?

కాగా, ఏపీలో రేపు మధ్యాహ్నం 1 గంట వరకు బస్సు సర్వీసులు నడపబోమని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ఈ కారణంగా తెలంగాణ నుండి వెళ్లే ఆంధ్ర బస్సులు ఉదయం నుంచి బంద్ కానున్నాయి. భారత్ బంద్ కు ఆటో యూనియన్లు, విద్యుత్ సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు మద్దతు తెలుపుతున్నారు.

Google Incognito Mode: ఇన్‌కాగ్నిటో మోడ్‌లో బ్రౌజింగ్‌లోనూ డేటా లీక్!!

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. ఈనెల 27 న భారత్‌ బంద్‌ నిర్వహించాలని జాతీయ రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందుకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటిస్తున్నాయి. ‘‘దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి చేసేలా, అప్రజాస్వామిక విధానంలో మోదీ పాలన కొనసాగుతోంది. మూడు వ్యవసాయ వ్యతిరేక చట్టాల్ని వ్యతిరేకిస్తూ, మోదీ ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగడుతూ దేశ వ్యాప్తంగా ఈ నెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌ చరిత్రాత్మకంగా నిలిచిపోతుంది” అని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది.