TSRTC : ప్రయాణికులకు సజ్జనార్ గుడ్ న్యూస్

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా దసరా పండుగకి ప్రత్యేక బస్సులను నడిపించేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

TSRTC : ప్రయాణికులకు సజ్జనార్ గుడ్ న్యూస్

Tsrtc

TSRTC : ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా దసరా పండుగకి ప్రత్యేక బస్సులను నడిపించేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఎప్పటిలాగే ప్రత్యేక బస్సులకు అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాలకే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటకలకు కూడా ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ నెల 8 నుంచి 14 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు వివరించారు. ప్రత్యేక బస్సులలో టికెట్‌ ఛార్జీకి అదనంగా 50 శాతం రుసుము వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

Read More : TSRTC : సందేశం పంపండి సమస్య పరిష్కరిస్తాం :- సజ్జనార్

దసరా పండగకు 4035 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. మహాత్మ గాంధీ బస్సు స్టేషన్ (MGBS) నుంచి 3,200 బస్సులు, జేబీఎస్‌ నుంచి 1200 బస్సులు తెలంగాణ, ఏపీకి నడవనున్నాయి. ప్రయాణికుల రద్దీని బట్టి మరికొన్ని బస్సులు అదనంగా తిప్పేందుకు అధికారులు నిర్ణయించారు. ఏపీతోపాటు తెలంగాణలోని ఖమ్మం, ఆదిలాబాద్‌, మంచిర్యాల,నిజామాబాద్‌ లాంటి ప్రాంతాలకు ముందస్తు బుకింగ్‌ చేసుకునే సదుపాయం కల్పించారు. కరీంనగర్‌,ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ బస్సులు జేబీఎస్‌ నుంచి బయలుదేరుతుండగా.. వరంగల్‌, మహబూబాబాద్‌కు వెళ్లే బస్సులు ఉప్పల్‌ నుంచి బయలు దేరనున్నాయి.

Read More : Shikhar Dhawan: మహిళా క్రికెటర్‌తో శిఖర్‌ ధావన్‌ పెళ్లి?

వైఎస్సార్‌ కడప జిల్లా, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వెళ్లే బస్సులు సీబీఎస్‌ నుంచి బయలుదేరతాయని టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు.