TSRTC : ఐడియా అదిరింది గురు ‘ఆర్టీసీలో పెళ్లి సందడి’

నష్టాల్లోంచి బయటపడేందుకు ఆర్టీసీ అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. ఇందుకోసం పెళ్లిళ్ల సీజన్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించింది.

TSRTC : ఐడియా అదిరింది గురు ‘ఆర్టీసీలో పెళ్లి సందడి’

Tsrtc

TSRTC : నష్టాల్లోంచి బయటపడేందుకు ఆర్టీసీ అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. ఇందుకోసం పెళ్లిళ్ల సీజన్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించింది. పెళ్లిళ్లకు బస్సులను అద్దెకిచ్చేందుకు ప్రత్యేక ప్రణాలికను సిద్ధం చేసుకుంటుంది. వచ్చే నెల నుంచి కనీసం రోజుకు వంద బస్సులు అద్దెకిచ్చేలా టార్గెట్‌ పెట్టుకుంది. గతంలో ఆర్టీసీ సెక్యూరిటీ డిపాజిట్ తీసుకునేది.. మొత్తం ఛార్జిలో 20 శాతాన్ని అడ్వాన్సుగా చెల్లించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు దానిని రద్దు చేసింది.

చదవండి : TSRTC Jobs : RTCలో ఉద్యోగాలు ప్రకటించిన సజ్జనార్

ఇక ఆర్టీసీ బస్సు అద్దె వివరాలను పరిశీలిస్తే.. అప్‌ అండ్‌ డౌన్‌ కలిపి గరిష్టంగా 200 కి.మీ. దూరం ఉంటే పికప్‌ అండ్‌ డ్రాప్‌ పద్ధతిలో బస్సులు కేటాయిస్తున్నారు. ఇందుకు కేవలం పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇక ఛార్జి విషయానికి వస్తే.. వెళ్లాల్సిన ప్రాంతానికి ఉన్న బసు చార్జికి అదనంగా 50 శాతం వసూలు చేస్తారు.

చదవండి : TSRTC: కలిసొచ్చిన దసరా.. TSRTCకి లాభాల పంట

ప్రయాణికులతో రద్దీతో కాకుండా సీట్లకు రేటు ఫిక్స్ చేస్తారు. ఇక మూడు పద్దతులను అందుబాటులోకి తెచ్చింది ఆర్టీసీ.. వెళ్లిరావడం, డ్రాప్ మాత్రమే చేయడం, పిక్ పికప్ చేసుకోవడం వంటివి అందుబాటులో ఉంటాయి. ఇక ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ బస్సులకు బస్సు చార్జి మొత్తని వసూలు చేస్తారు.. ఈ బస్సులకు అదనపు చార్జి ఉండదు.

చదవండి : TSRTC : అదనపు చార్జీలు లేకుండానే అదరగొట్టిన ఆర్టీసీ.. అనుకున్న దానికంటే రూ.3 కోట్లు ఎక్కువే

ఒక నిర్దిష్ట సమయానికి బస్సును కేటాయిస్తుంది ఆర్టీసీ, సమయం దాటిపోతే వెయిటింగ్ చార్జి వసూలు చేస్తారు. వెయిటింగ్ ఛార్జ్ సాధారణ బస్సుకి రూ.300, ఏసీ బస్సులకు రూ.400 చోటున వసూలు చేస్తారు. అయితే ఆర్టీసీ తీసుకొచ్చిన ఈ విధానం అందరికి అందుబాటులోనే ఉండనుంది. ప్రైవేట్ బస్సులతో పోల్చితే ఆర్టీసీలో ధరలు తక్కువే ఉంటాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.