TSRTC : దసరా పండగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపనుంది. అక్టోబర్ 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది.

TSRTC : దసరా పండగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Rtc Bus

special buses for the Dussehra : దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ మేరకు టీఎస్‌ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్టోబర్ 8వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ దసరాకు 4,045 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 3,085 బస్సులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు, 950 బస్సులను ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ప్రయాణికుల రద్దీని బట్టి నడుపుతామని వెల్లడించారు.

హైదరాబాద్‌లో ప్రధాన బస్ స్టేషన్లు అయిన జేబీఎస్, ఎంజీబీఎస్‌తో పాటు బీహెచ్ఈఎల్, లింగంపల్లి, చందానగర్, మియాపూర్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ కాలనీ, అమీర్ పేట్, టెలీఫోన్ భవన్, దిల్‌సుఖ్‌గర్, ఈసీఐఎల్ క్రాస్ రోడ్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్, అరాంఘర్ క్రాస్ రోడ్‌ల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడిపించనున్నట్లు వరప్రసాద్ పేర్కొన్నారు.

Dussehra holidays : అక్టోబర్ 5 నుంచి దసరా సెలవులు

రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ వెళ్లే బస్సులను జూబ్లీ బస్ స్టేషన్ నుంచి నడిపించనున్నట్లు పేర్కొన్నారు. వరంగల్, పరకాల, మహబూబాబాద్, భువనగిరి, యాదగిరి గుట్టకు వెళ్లే బస్సులు ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి బయలుదేరనున్నట్లు చెప్పారు. నల్గొండ, కోదాడ, సూర్యాపేటకు వెళ్లే బస్సులు దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి నడిపించనున్నట్లు వెల్లడించారు.

రాయలసీమ ప్రాంతాలైన కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపూరం, ఒంగోలు, నెల్లూరుకు ఓల్డ్ సీబీఎస్ నుంచి ప్రత్యేక బస్సులు ఉంటాయిని పేర్కొన్నారు. మిగిలిన బస్సులను ఎమ్ జీబీఎస్ నుంచి నడిపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రిజర్వేషన్ సౌకర్యం ఉన్న బస్సులపై ఒకటిన్నర శాతం ఛార్జీలు అధికంగా వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా నడిపే ఈ ప్రత్యేక బస్సులతో టీఎస్‌ ఆర్టీసీకి రూ.3 నుంచి రూ.4 కోట్ల వరకు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.