మీటర్ ఫొటో తీయండి..కరెంటు బిల్లు వస్తుంది..అదెలా ? 

దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా ఆర్థికరంగం కుదేలవుతోంది. ఎన్నో రాష్ట్రాల ఖజానాకు ఆదాయం రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తోంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ

మీటర్ ఫొటో తీయండి..కరెంటు బిల్లు వస్తుంది..అదెలా ? 

దిక్కుమాలిన కరోనా వైరస్ కారణంగా ఆర్థికరంగం కుదేలవుతోంది. ఎన్నో రాష్ట్రాల ఖజానాకు ఆదాయం రావడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారిస్తోంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండిపోవాల్సి వస్తుంది. కొంతమంది మాత్రం ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎలక్ట్రిసిటీ సిబ్బంది కూడా ఉన్నారు.

ఇక్కడ బిల్సీ రీడింగ్ చేసే వారు మాత్రం ఇంటింటికి వెళ్లలేకపోతున్నారు. మీటర్ బిల్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది. వచ్చే నెలకు బిల్స్ రీడింగ్ ను వాయిదా వేసింది. కానీ అంతలోపు బిల్లులు చెల్లించే విధంగా కొత్త కొత్త రూట్లు వెతుకున్నారు. ఇందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఉపయోగించిన విధంగా ఇక్కడ ఉపయోగించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఎవరు ఇంటి మీటర్ ఫొటో వారే తీసి..ఆన్ లైన్ లో పంపితే..ప్రోత్సాహకాలు ఇస్తామని ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (DERC) ప్రకటించింది. ఇందుకు ఢిల్లీ డిస్కంలు యాప్ ను రూపొందించాయి. వినియోగదారులే మీటర్ రీడింగ్ తీసి ఆన్ లైన్ లో పంపించే విధంగా ఓ యాప్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ఉత్తర్ తెలంగాణ డిస్కం కసరత్తు చేస్తోంది.

లాక్ డౌన్ కారణంగా ప్రయోగాత్మకంగా వాడేందుకు అనుమతించాలని డిస్కంలను కోరింది. దీనివల్ల డబ్బులు ఆదా అవుతాయని వెల్లడిస్తోంది. వినియోగదారుడు సరిగ్గా 30 రోజులకు తానే ఫొటో తీసి ఆన్ లైన్ ద్వారా పంపితే..బిల్లు పెరిగే బాధ ఉండదు.

ఎలా పనిచేస్తుంది : – దీనికి సంబంధించిన యాప్ ను వినియోగదారులు తమ తమ స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకోవాలి. కరెంటు కనెక్షన్ నెంబర్, ఫోన్ నెంబర్ తదితర వివరాలు ఎంట్రీ చేయాలి. మీటర్ రీడింగ్ నెలకొసారి తీసి యాప్ లో అప్ లోడ్ చేయాలి. ఆన్ లైన్ ద్వారా డిస్కంకు చేరి ఎంత బిల్లు వచ్చిందో తెలిసిపోతుంది. ఆన్ లైన్ ద్వారానే డబ్బులు కూడా చెల్లించవచ్చు.