TSSPDCL Warns : ఆ నెంబర్‌కు కాల్ చేయొద్దు, విద్యుత్ వినియోగదారులకు హెచ్చరిక

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ మేసేజ్ లు, ఫేక్ కాల్స్ తో జనాలను బురిడీ కొట్టేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి వారి ఖాతా

TSSPDCL Warns : ఆ నెంబర్‌కు కాల్ చేయొద్దు, విద్యుత్ వినియోగదారులకు హెచ్చరిక

Tsspdcl Warns

TSSPDCL Warns : కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. ఫేక్ మేసేజ్ లు, ఫేక్ కాల్స్ తో జనాలను బురిడీ కొట్టేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతా వివరాలు సేకరించి వారి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. తాజాగా సైబర్ క్రిమినల్స్ కన్ను విద్యుత్ వినియోగదారుల మీద పడింది.

Hybrid Flying Car : ఎగిరిపోతే ఎంత బాగుంటుంది.. ఫ్ల‌యింగ్ కారు వచ్చేస్తోంది, మేడిన్ ఇండియా

విద్యుత్ బిల్లులు కట్టని కొంతమంది వినియోగదారులకు మేసేజ్ లు వస్తున్నాయి. అవి చూసి వారు ఆందోళనకు గురవుతున్నారు. విద్యుత్ బిల్లు కట్టనివారికి రాత్రి 10.30 గంటల తర్వాత కరెంట్ నిలిపివేస్తాం అని మేసేజ్ లు పంపుతున్నారు. అంతేకాదు, కరెంట్ కట్ కాకుండా ఉండాలంటే 96928 48762 నెంబర్ కు కాల్ చేయాలని మేసేజ్ లో సూచిస్తున్నారు.

Malware ముప్పు.. బ్యాంకు యూజర్లకు వార్నింగ్, క్లిక్ చేస్తే ఖాతా ఖాళీ

ఈ విషయం TSSPDCL సీఎండీ రఘుమా రెడ్డి దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే స్పందించారు. విద్యుత్ వినియోగదారులను అలర్ట్ చేశారు. అది ఫేక్ మేసేజ్ అని స్పష్టం చేశారు. అలాంటి మేసేజ్ లను నమ్మొద్దని కోరారు. అంతేకాదు ఆ ఫోన్ నెంబర్ కు కాల్ చేయొద్దని సూచించారు. పొరపాటున ఆ నెంబర్ కు కాల్ చేస్తే మీ బ్యాంకు అకౌంట్ వివరాలు తెలుసుకుని, డబ్బులు లాగేస్తారని హెచ్చరించారు. వాస్తవానికి, బిల్లు పెండింగ్ లో ఉన్నా టీఎస్ఎస్ పీడీసీఎల్ కరెంట్ కట్ చేయదని, అందులోనూ రాత్రిపూట పవర్ కట్ చేయదని రఘుమా రెడ్డి తేల్చి చెప్పారు. 96928 48762 నెంబర్ నుంచి వచ్చే ఫేక్ కాల్స్ కు స్పందించవద్దని కోరారు. ఆ నెంబర్ తో కరెంట్ కట్ చేస్తామని ఎవరికైనా మేసేజ్ వస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రఘుమా రెడ్డి చెప్పారు.